iDreamPost
android-app
ios-app

Isha Ambani: వజ్ర వైడుర్యాలతో జాకెట్.. అంబానీ కూతురంటే ఆమాత్రం ఉండాల్సిందే!

  • Published Mar 07, 2024 | 12:41 PM Updated Updated Mar 07, 2024 | 12:49 PM

ప్రస్తుతం పెళ్లి అనే మాట తలిస్తే అందరికి గుర్తొచ్చేది.. అంబానీ కుటుంబం. ఇప్పుడు ముఖేష్ అంబానీ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు .. సంబంధించిన ప్రతి వార్త ప్రత్యేకమే. తాజాగా ముఖేష్ అంబాని కూతురు ఈషా అంబానీ ధరించిన దుస్తులు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం పెళ్లి అనే మాట తలిస్తే అందరికి గుర్తొచ్చేది.. అంబానీ కుటుంబం. ఇప్పుడు ముఖేష్ అంబానీ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు .. సంబంధించిన ప్రతి వార్త ప్రత్యేకమే. తాజాగా ముఖేష్ అంబాని కూతురు ఈషా అంబానీ ధరించిన దుస్తులు హాట్ టాపిక్ గా మారాయి.

  • Published Mar 07, 2024 | 12:41 PMUpdated Mar 07, 2024 | 12:49 PM
Isha Ambani: వజ్ర వైడుర్యాలతో జాకెట్.. అంబానీ కూతురంటే ఆమాత్రం ఉండాల్సిందే!

ఇప్పుడు ప్రత్యేకించి అనంత్ అంబానీ వివాహం చూసేందుకు.. వారి స్వస్థలానికి వెళ్లనవసరం లేదు. ఎందుకంటే మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి వివాహ వేడుకల .. సంబరాలే కనిపిస్తున్నాయి. పైగా సామజిక మాధ్యమాలలో వాటిని వీక్షించే వారికి స్వయంగా అక్కడి వేడుకలలో పాలుపంచుకున్న అనుభూతిని ఇస్తున్నాయట. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు వారి సెలెబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో. ఇక అనంత్ అంబాని , రాధికా మర్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో మెరిసిన సెలెబ్రిటీలు, వారు ధరించిన దుస్తులు దగ్గరనుంచి వేసుకున్న ఆభరణాల వరకు.. ప్రతి ఒక్కటి వైరల్ అవుతూనే ఉంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో లో చక్కర్లు కొడుతున్న వీడియో మాత్రం .. వీటి అన్నిటికి హైలెట్ గా నిలిచింది. ఆ వీడియో ఏంటంటే.. ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ ధరించిన దుస్తులు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెళ్ళికి వచ్చిన అతిధులు, పెళ్లి కూతురు , పెళ్లి కొడుకు ధరించిన ఆభరణాలు, దుస్తులు ఇలా ఇప్పటివరకు వీటి గురించి వినిపించిన .. వార్తలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ ధరించిన దుస్తులు ఒక ఎత్తు. ఒకప్పుడు, కోహినూర్ వజ్రాన్ని ధరించిన ఇంగ్లాండ్ మహారాణి గురించి.. ఎంత గొప్పగా చెప్పుకున్నారో.. ఇప్పుడు ఈషా అంబానీ గురించి కూడా అలానే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే .. ఇప్పుడు ఈషా అంబానీ .. కోహినూర్ కాదు కానీ.. అలాంటి వజ్రాలను, వైఢూర్యాలను, కెంపులను, రత్నాలను కలబోసి కుట్టిన జాకెట్ ను ఈషా అంబానీ ధరించారు. ఇక దీని విలువ ఎన్ని కోట్లు ఉంటుందో అందరు ఊహించగలరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో .. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. మరి, ముఖేష్ అంబానీ కూతురంటే ఆమాత్రం ఉంటుంది కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కేవలం ఈషా అంబానీ దుస్తులతో పాటు.. నీతా అంబానీ అంబానీ ధరించిన చీరలు కూడా అందరిని అట్ట్రాక్ట్ చేశాయి. ఆ చీరలే లక్షల్లో .. కోట్లలో ఖరీదు చేస్తున్నాయంటే .. నీతా అంబానీకి ఆ చీరలు కట్టినందుకు కూడా .. లక్షల్లో ఛార్జ్ చేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా సామజిక మాధ్యమాలలో షికార్లు కొడుతున్నాయి. కేవలం ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నే మూడు రోజుల పాటు.. అత్యంత ఘనంగా చేసిన ముఖేష్ అంబానీ కుటుంబం.. ఇక పెళ్లి వేడుకలను ఎవరికీ ఊహించనటువంటి రేంజ్ లో చేస్తారని చెప్పడంలో.. ఎటువంటి సందేహం లేదు. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కూడా.. ఇంకా వాటి గురించి సోషల్ మీడియాలో ఏ మాత్రం జోష్ తగ్గలేదు. మరి, ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by FlixZon (@flixzonofficial)

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş