iDreamPost
android-app
ios-app

ఈ రకం 500 రూపాయల నోట్లపై ఫేక్ ప్రచారం! అసలు నిజం ఏంటంటే..

Rs 500 Note with Star: నిజం గడప దాటేలోపు, అబ్దం ఊరంత చూట్టేసి వస్తుందని పెద్దలు అంటుంటారు. అలానే ఓ సిరీస కలిగిన రూ.500 నోట్ల విషయంలో కూడా అలానే జరిగింది. అయితే ఆ నోటుపై జరిగిన ప్రచారం నిజానిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Rs 500 Note with Star: నిజం గడప దాటేలోపు, అబ్దం ఊరంత చూట్టేసి వస్తుందని పెద్దలు అంటుంటారు. అలానే ఓ సిరీస కలిగిన రూ.500 నోట్ల విషయంలో కూడా అలానే జరిగింది. అయితే ఆ నోటుపై జరిగిన ప్రచారం నిజానిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఈ రకం 500 రూపాయల నోట్లపై ఫేక్ ప్రచారం! అసలు నిజం ఏంటంటే..

నేటికాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇదే సమయంలో నిజం ఏమిటి, అబద్ధం ఏంటీ అని కూడా తెలుసుకోకుండా.. కనిపించిన వాటినల్లా పోస్టు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని విషయాలపై అనేక అనుమానాలు సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. అలానే ఇటీవల రూ.500 నోటుపై ఓ ప్రచారం జరుగుతోంది. స్టార్ మార్క్  ఉన్న రూ.500 నోట్లు నకిలీవి అంటూ ఓ ఫేక్ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే 500 రూపాయల నోట్లపై జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత.. అలాంటి నోట్లు ఒరిజినలా లేక నకిలీనా అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

అసలు కథ ఏమిటంటే.. మార్కెట్ లో కొన్ని రకాల 500 రూపాయల నోట్లపై ఉండే సీరియల్ నెంబర్స్ మధ్యన స్టార్ గుర్తు ఉన్ననోట్లపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అలా స్టార్ గుర్తు ఉండే 500 రూపాయల నోట్లు నకిలీవీ అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. సాధారణంగానే కరెన్సీ నోట్లపై సిరీస్ నెంబర్ ఉంటాయి. అలానే 500 రూపాయల నోటుపై కూడా సిరీస్ నెంబర్ ఉండే విషయం అందరికి తెలిసింది. అయితే అలా సిరీస్ నెంబర్ మధ్యలో స్టార్ గుర్తు ఉండే నోట్లు నకిలీవి అని, వాటిని ఎవరూ తీసుకోవద్దంటూ  సోషల్ మీడియాలో కొందరు విష ప్రచారం చేస్తున్నారు. దీంతో మార్కెట్ లో చాలా మంది 500 రూపాయల నోట్లపై ఉండే సిరీస్ నెంబర్ల మధ్య స్టార్ గుర్తు  ఉంటే.. ఆ నోట్లు తీసుకోవటం లేదు. ఇలా రూ.500 నోటుపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి.. అసలు వాస్తవం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

500 రూపాయల నోటుపై ఉండే సిరీస్ నెంబర్ మధ్య స్టార్ గుర్తు ఉన్న నోటు నిజమైనదే.  ఈ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఇండియానే విడుదల చేసింది. 2016, నవంబర్ 8వ తేదీన ఆర్బీఐ రిలీజ్  చేసిన ఓ నోట్ లో ఇది స్పష్టంగా ఉంది. రూ.500 నోటుపై సిరీస్ నెంబర్ మధ్య స్టార్ గుర్తుతో  ఉన్న నోట్లను రిలీజ్ చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 2016లోనే ఇలాంటి గుర్తుతో నోట్లను విడుదల రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. కేవలం 500 రూపాయల నోట్లపైనే కాకుండా 10, 20, 50, 100 నోట్లపైనా కూడా అప్పట్లో స్టార్ గుర్తును ఆర్బీఐ ముద్రించింది. కాబట్టి 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే.. ఆ నోటు ఒరిజినలే అని ఆర్బీఐ చెప్పింది. కాబట్టి రూ.500 నోటుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం ఇది. కాబట్టి  స్టార్ మార్క్ ఉన్న రూ.500 నోట్ల విషయంలో డోంట్ వర్రీ.. మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లపై స్టార్ గుర్తు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి