iDreamPost
android-app
ios-app

12th Fail Movie: ”12th ఫెయిల్” రియల్ హీరోకి ప్రమోషన్! నిజాయితీకి దక్కిన గౌరవం..

ఎటువంటి హడావుడి లేకుండా చిన్న సినిమా వచ్చి.. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన చిత్రం 12th ఫెయిల్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన నిజాయితీ, ముక్కు సూటితనం గురించి ఈ సినిమాలో చూపించారు. తాజాగా ఆయన నిజాయితీకి గౌరవం దక్కింది.

ఎటువంటి హడావుడి లేకుండా చిన్న సినిమా వచ్చి.. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన చిత్రం 12th ఫెయిల్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన నిజాయితీ, ముక్కు సూటితనం గురించి ఈ సినిమాలో చూపించారు. తాజాగా ఆయన నిజాయితీకి గౌరవం దక్కింది.

12th Fail Movie: ”12th ఫెయిల్” రియల్ హీరోకి ప్రమోషన్! నిజాయితీకి దక్కిన గౌరవం..

“12th ఫెయిల్” చిన్న సినిమాగా వచ్చి భారీ హీట్ సాధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో సందడి చేస్తోంది. మోస్ట్ వాచబుల్ అండ్ ఇన్‌స్పిరేషనల్‌ సినిమాగా నిలిచింది. ఈ మూవీని విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను రియల్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమర్ శర్మ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా.. మనోజ్ శర్మను సెలబ్రిటీగా మార్చింది. సోషల్ మీడియాలో  ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపించింది. తాజాగా ఆయనకు పదోన్నతి లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎటువంటి హడావుడి లేకుండా చిన్న సినిమా వచ్చి.. థియేటర్లలో ప్రభంజనం సృష్టించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 12th ఫెయిల్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్లతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. పేద కుటుంబం నుంచి వచ్చి, 12వ తరగతి ఫెయిలైన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా… అక్టోబర్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అనతంరం ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. థియేటర్లలో కన్నా ఓటీటీలోకి వచ్చాకే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రియల్ హీరో విషయంలో ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. 12th ఫెయిల్ రియల్ హీరో మనోజ్ కుమార్ శర్మకు తన విధుల్లో ప్రమోషన్ లభించింది. మహారాష్ట్ర పోలీస్‌లో డిప్యూటీ ఇన్సెపెక్టర్ జనరల్ (డీఐజీ) స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) గా పదోన్నతి లభించింది. 2003,2004,2005 బ్యాచ్‌ల ఐపీఎస్ ఆఫీసర్లకు క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ప్రమోషన్లకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్నిట్విట్టర్ వేదికగా మనోజ్ శర్మ వెల్లడించారు. అంతేకాక ఆయన తన ప్రయాణం గురించి చెప్పారు. తన కెరీర్ లో క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎఎస్పీగా ప్రారంభమైన ప్రయాణం భారత ప్రభుత్వ ఆదేశంతో ఐజీగా అయ్యేందుకు ఈ రోజు పట్టిందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇక ఆయనకు సోషల్ మీడియా వేదిక మనోజ్ శర్మకు అభినందనలు తెలుపుతున్నారు. కంగ్రాట్స్, మనోజ్ సర్, మీ నిజాయితీకి తగ్గిన గౌరవం ఇది, అలానే మీ జీవితం మాకు స్పూర్తినిచ్చింది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ దేశానికి మీ లాంటి ముక్కుసూటి, నిజాయితీ గల అధికారులు కావాలని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరి.. మనోజ్ శర్మకు ఐజీగా ప్రమోషన్ రావడంపై మీ అభినందనలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.