పండగపూట మరో రైలు ప్రమాదం.. ఉలిక్కిపడ్డ రైల్వే శాఖ

Train Derailed Madhya pradesh: రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పండగపూట మరో రైలు ప్రాదం చోటుచేసుకుంది. దీంతో రైల్వే శాఖ ఉలక్కిపడింది.

Train Derailed Madhya pradesh: రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పండగపూట మరో రైలు ప్రాదం చోటుచేసుకుంది. దీంతో రైల్వే శాఖ ఉలక్కిపడింది.

మనదేశంలో రైలు ప్రయాణం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ప్రయాణ ఖర్చులు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవడంతో ట్రైన్ జర్నీకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నది రైల్వే శాఖ. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైల్లో మంటలు చెలరేగడం, రైలు పట్టాలు తప్పడం, ఒకదానికి ఒకటి ఢీకొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో రైలు ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో పండగపూట మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రైల్వే శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ ఎక్కడంటే?

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ స్టేషన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22191) “డెడ్ స్టాప్ స్పీడ్” వద్ద ప్రమాదానికి గురైంది. రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదం జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు చోటుచేసుకుంది. రైలు ఇండోర్ నుంచి వస్తుండగా జబల్‌పూర్ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 6కి చేరుకుంటున్న సమయంలో ముందు ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని సీపీఆర్‌వో హర్షిత్ శ్రీవాస్తవ చెప్పారు.

అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంత అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక రైలు ప్రమాదానికి గురైన వెంటనే ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. ఇక ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Show comments