మన దేశం పేరు మార్చాలనే డిమాండ్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నదే. దేశ రాజ్యాంగంలో నమోదైన ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే మాటను మార్చి కేవలం ‘భారత్’ అని ఉంచాలనే డిమాండ్ ఈమధ్య కాలంలో బాగా ఊపందుకుంది. ఈ విషయంపై సుప్రీం కోర్టులో మూడేళ్ల కింద ఒక పిటిషన్ కూడా వేశారు. ‘ఇండియా’ అనేది గ్రీకు పదమైన ‘ఇండికా’ నుంచి వచ్చింది.. కాబట్టి ఆ పేరును తొలగించాలని పిటిషనర్ కోరారు. దేశం పేరును ‘భారత్’గా మార్చాలని కేంద్ర సర్కారుకు సూచించాలని అప్పీల్ చేశారు. అయితే అప్పట్లో సుప్రీం చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
అప్పట్లో ఆ పిటిషన్ అంశం అక్కడికే ముగిసింది. కానీ ఈమధ్య దేశం పేరు మార్చాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. దీనిపై కేంద్రంలోని మోడీ సర్కారు కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భారత దేశానికి ఉన్న ఇంగ్లీష్ పేరు ‘భారత్’గా మారబోతోందా అంటే? అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐద్రోజుల పాటు సాగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఈ మేరకు ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తూ కేంద్రం బిల్లు తీసుకురానుందని సమాచారం.
అధికార బీజేపీ ఎంపీలతో పాటు ఢిల్లీ వర్గాల్లో ప్రస్తుతం సాగుతున్న చర్చల సారాంశం గనుక నిజమైతే మాత్రం ఇండియా ఇక మీదట భారత్‌గా పేరు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటీష్ కాలం నాటి నల్ల చట్టాలతో పాటు ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను మార్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. పనిలో పనిగా దేశం పేరు కూడా మార్చబోతున్నట్లు వినికిడి. ఎన్డీయే సర్కారు ‘ఇండియా’ పేరు మార్పు ప్రయత్నాల వెనుక మరో కీలక కారణం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏర్పడిన విపక్ష కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టారు. బ్రిటీష్ కాలం నాటి ‘ఇండియా’ను వదిలి ‘భారత్’గా మారిస్తే అప్పుడు విపక్షాలను విదేశీ పేరుతో లక్ష్యంగా చేసుకోవచ్చనేది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ దేశం పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఎలాంటి ఆటంకాలు ఉండవనే చెప్పాలి. రాజ్యసభలో ఇటీవల ఎన్డీయే నెగ్గించుకున్న బిల్లులను చూస్తే.. పేరు మార్పు బిల్లు ఆమోదం పొందడం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి.. దేశం పేరు మార్పు అంటూ కేంద్రం కొత్త ఆలోచన చేస్తోందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పవన్.. ప్రశ్నించడమంటే ఇదేనా..?
#Breaking: India is likely to be renamed ‘Bharat,’ as per media reports. 🇮🇳
What are your thoughts? #INDIA #BHARAT
— iDream Media (@iDreamMedia) September 5, 2023