IFS అధికారి ఎమోషనల్ ట్వీట్.. గర్ల్‌ ఫ్రెండ్ లేదు.. ఎప్పుడూ ఒంటరితనమే..!

చదువులు, ఉద్యోగాలు అంటూ చాలా మంది ఒంటరితనంతో కూడిన జీవితాన్ని బతుకుతూ ఉంటారు. కానీ ఈ ఒంటరితనం మానసికమైన ఒత్తిడికి గురి చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు పరిష్కారమార్గాలున్నాయి అని చెబుతున్నాడు ఓ అధికారి.

చదువులు, ఉద్యోగాలు అంటూ చాలా మంది ఒంటరితనంతో కూడిన జీవితాన్ని బతుకుతూ ఉంటారు. కానీ ఈ ఒంటరితనం మానసికమైన ఒత్తిడికి గురి చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు పరిష్కారమార్గాలున్నాయి అని చెబుతున్నాడు ఓ అధికారి.

మనిషి జీవితంలో ఎవరో ఒక తోడు ఉండాలి. బాధలు, కష్టాలు, కన్నీళ్లు పంచుకోవాలనిపిస్తూ ఉంటుంది. అమ్మ, నాన్నలకు ఓ దశ వరకు అన్ని చెప్పుకోగలుగుతారు. కొన్ని సార్లు వారికి చెప్పలేనివి కూడా స్నేహితులతో పంచుకుంటారు. ఇక పెళ్లి అయితే భార్యకో లేదా భర్తకో తమ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆవేదనను పంచుకుంటారు. కానీ కొన్ని సార్లు ఒంటరి ప్రయాణం తప్పదు. తగిలిన ఎదురు దెబ్బలు లేదా నమ్మక ద్రోహం, భవిష్యత్తుపై బలమైన ప్రణాళికలు కూడా మనిషిని ఒంటరిగా నడిపిస్తుంటాయి. అయితే ఈ ఒంటరితనం కొంత మందిని మానసికంగా క్రుంగబాటుకు గురి చేస్తూ ఉంటుంది. తోడు ఎవరన్నా ఉండే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది.

తోడు కావాలనుకోవడం ఎంత సహజమో, ఒంటరితనం కూడా అంతే సహజమని చెబుతున్నారు ఐఎఫ్ఎస్ అధికారి హిమాంన్షూ త్యాగి. చదువు పేరుతో తాను స్నేహితులకు ఎలా దూరంగా ఉన్నారో, ఒంటరి తనాన్ని ఎలా ఎదుర్కొవాలో ట్వీట్ చేశారు. తన జీవితాన్ని ఉదాహరణ చూపిస్తూ.. పలు సూచనలు చేశారు. ‘ఏడాది పాటు జేఈఈ ప్రిపరేషన్, 4 సంసవత్సరాలు ఐఐటీ, ఆరేళ్ల పాటు వివిధ ఉద్యోగాలు. ఇవన్నీ ఒంటరిగానే చేశాను. ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. నాకు కొద్ది మంది మాత్రమే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అంతా ఒంటరి తనమే. దీన్ని నేను చాలా దగ్గర నుండి చూశా. కానీ ఒంటరితనంలోనే ఎదిగా. కాబట్టి ఒంటరితనం మిమ్మల్ని బాధిస్తోందనిపిస్తే ఇది చదవండి ’ అంటూ ట్వీట్ చేశారు.

‘మనం ఆత్మీయులతో ఉంటే సంతోషంగా ఉంటుంది. వాళ్లు మనల్ని విడిచి పెట్టి వెళ్లిపోతే.. గుండె బద్దలు అవుతుంది. మంచి మానవ సంబంధాలు ఆరోగ్యానికి కీలమే. కానీ, మన చుట్టూ ప్రతిసారి నమ్మదగిన వారు ఉంటారన్న గ్యారెంటీ లేదు. కాబట్టి, ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఎలా జీవించాలో తెలుసుకోండి. మీకు మీరే స్నేహితుడిగా మారాలి. ప్రతి రోజు మీ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. ప్రకృతితో మమేకం కండి. అలా చేస్తేనే మీ ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఆవేదన, ఆలోచనలు రాయండి. అలాగే మీరు బాధలను పంచుకునేందుకు కొంత సమయం ఇవ్వండి. వాటిని మీ తల్లిదండ్రులు, తోబుట్టువులతో పంచుకోండి. మీ బాధలను పరిష్కరించుకోవడానికి ఒక్క ఫోన్ కాల్ సరిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు లోతైన ప్రశ్నలు సంధించుకోండి. భగవంతునితో అనుసంధానం కండి. ప్రతి విషయంలో భగవంతుడికి ధన్యవాదాలు తెలపండి. ఇలా చేస్తే ఒంటరిగా ఉన్నామన్న ఆలోచనే రాదు’అంటూ ట్వీట్స్ చేశారు హిమాంన్షూ. అతడి సలహాలకు యువత ఫిదా అవుతున్నారు.

Show comments