iDreamPost
android-app
ios-app

కేంద్రం గుడ్ న్యూస్.. వారికి వేతనాల పెంపు!

కేంద్ర ప్రభుత్వం తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు శుభవార్తలు అందిస్తూ ఉంది. తాజాగా ఓ పథకం కింద పని చేస్తున్న వారికి వేతనాలను కేంద్రం పెంచింది.

కేంద్ర ప్రభుత్వం తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు శుభవార్తలు అందిస్తూ ఉంది. తాజాగా ఓ పథకం కింద పని చేస్తున్న వారికి వేతనాలను కేంద్రం పెంచింది.

కేంద్రం గుడ్ న్యూస్.. వారికి వేతనాల పెంపు!

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి పలు రంగాల్లో అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అలానే కరువు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా  కొన్ని స్కీమ్స్ ను కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. ఈ స్కీమ్ కి  దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. పథకం విషయంలో తరచూ కేంద్రం  పలు మార్పులు చేస్తూ ఉంటుంది. ఈ పథకం ద్వారా కూలీలకు అందించే వేతనాలు గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తుంది. తాజాగా ఈ ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్  వచ్చింది.

దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద  కూలీలకు ఇచ్చే రోజూ వారీ వేతనాన్ని త్వరలో పెంచనున్నారు. ఇటీవలే ఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ ఉపాధి కూలీల వేతనాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం  ఎన్నికల సంఘ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే వేతనాల పెంపుపై  కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని ప్రభుత్వం తీసుకున్నట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. ఇక ఈ వేతన పెంపు అనేది కొత్తగా పెట్టినది కాదని, ఇది ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియే అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్రం వాదనతో ఎన్నికల సంఘం ఏకీభవించింది. దీంతో  ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో కొత్త  జీతాలు అమల్లోకి వస్తాయి.

ఉపాధి కూలీ జీతాల పెంపుకు అనుమతించిన ఈసీఈ కొన్నికీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేతలనాలకు గురించి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం కింద వేతనాల్లో మార్పులకు 2019 ఎన్నికల సమయంలోనూ అనుమతి లభించిందని, అలా పెంచుతున్నట్లు ప్రచారం చేసుకోకూడదని అప్పట్లో ఈసీ ఆదేశించిందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారు ఎవ్వరూ ఈ వేతనాల పెంపుప గురించి ప్రస్తావించరాదని అప్పట్లో చెప్పినట్లు గుర్తు చేశారు. మొత్తంగా ఎన్నికల వేళ ఉపాధి హామీ పథకం లో పని చేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇక ఈ పథకం 2005లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించి  సంగతి తెలిసిందే.  ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.  కరువు ప్రాంతాల్లో ఉండే  ప్రజలకు ఉపాధి ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా ఎంతో మంది ఉపాది పొందుతున్నారు. మొత్తంగా ఈ వేతనాల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.