iDreamPost
android-app
ios-app

శాడిస్టు భర్త.. 12 ఏళ్లుగా భార్యను గదిలో పెట్టి..

  • Published Feb 02, 2024 | 7:35 PM Updated Updated Feb 02, 2024 | 7:35 PM

Husband Locks Up Wife In House: పెద్దల సమక్షంలో పెళ్లైంది.. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగు పెట్టింది ఆ ఇల్లాలు. కానీ శాడిస్టు భర్త ఆమెను దారుణంగా హింసించిన ఘటన అందరి హృదయాలు కలచివేసింది.

Husband Locks Up Wife In House: పెద్దల సమక్షంలో పెళ్లైంది.. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగు పెట్టింది ఆ ఇల్లాలు. కానీ శాడిస్టు భర్త ఆమెను దారుణంగా హింసించిన ఘటన అందరి హృదయాలు కలచివేసింది.

  • Published Feb 02, 2024 | 7:35 PMUpdated Feb 02, 2024 | 7:35 PM
శాడిస్టు భర్త.. 12 ఏళ్లుగా భార్యను గదిలో పెట్టి..

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. అయితే పట్టుమని ఏడాది కాకుండానే కొంతమంది భార్యాభర్తలు విడిపోతున్నారు. సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం.. సర్ధుకు పోవడం జరుగుతుంది. కానీ కొంతమంది దంపతుల మధ్య వచ్చే విభేదాలు విడాకుల వరకు వెళ్తుంటాయి. ఇదిలా ఉంటే కొంతమంది భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకొని పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటారు. ఓ అనుమానపు భర్త తన భార్యను దారుణంగా హింసించిన ఘటన కర్ణాటకలోని మైసూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని మైసూరు లో దారుణ ఘటన వెలుగు చూసింది. గత పన్నెండేళ్లుగా ఓ శాడిస్టు అనుమానపు భర్త తన భార్యను ఒక ఇంట్లో బంధించి తలుపులకు తాళం వేస్తూ వచ్చాడు. తాను ఏ పనిమీద బయటకు వెళ్లినా భార్యను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తాడని బాధిన మహిళ పోలీసులకు తెలిపింది. ఈ దారుణం చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళకు బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు. తన భర్త 12 ఏళ్లుగా మానసిక క్షోభకు గురి చేశాడని, ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని.. చాలా కాలం నుంచి ఈ బాధతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ మహాళ మాట్లాడుతూ.. ‘నాకు పెళ్లై 12 సంవత్సరాలు అయ్యింది.. నన్ను నా భర్త ఎప్పుడూ ఇంట్లో ఉంచి హింసించేవాడు. ఈ విషయం గురించి ఆయన్ని ఎవరూ ప్రశ్నించరు. నా పిల్లలు స్కూల్ కి వెళ్లి నా భర్త వచ్చే వరక బయటనే ఉంటారు. నేను వారిని కిటికీ లోనుంచి చూడాల్సిన దుస్థితి. వారికి కిటికీ నుంచే ఆహారం అందిస్తాను. మరుగుదొడ్డి కోసం చిన్న డబ్బా ఏర్పాటు చేశాడు. నా తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడు వెళ్లానో గుర్తుకు లేదు’ అంటూ పోలీసుల ముందు కన్నీరు పెట్టుకుంది. అయితే.. భర్త పై కేసు పెట్టడానికి మాత్రం బాధిత మహిళ ఇష్టపడలేదు. తన తల్లదండ్రుల వద్దనే ఉంటానని.. తన భర్తతో ఇక ఉండలేనని తేల్చి చెప్పింది. ఇటీవల ఆ శాడిస్టు భర్త ఆంక్షలు మరింత ఎక్కువ కావడంతో విషయం తెలుసుకున్న పుట్టింటి వారు.. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ మహిళ భర్తకు కౌన్సింలింగ్ ఇచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet