iDreamPost
android-app
ios-app

సౌత్ వాళ్ళు ఇష్టపడే సాంబార్‌ని తొలిసారిగా ఎవరు తయారు చేశారో తెలుసా?

  • Published May 04, 2024 | 6:47 PM Updated Updated May 04, 2024 | 6:47 PM

సాంబార్ అంటే ఇష్టపడని వారు ఉండరేమో. హోటల్స్ లో డైలీ ఎన్ని కూరలు ఉన్నా సాంబార్ ఉండాల్సిందే. శుభకార్యాల్లో విందు భోజనాలప్పుడు సాంబార్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సాంబార్ కి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు మనవాళ్ళు. వేడి వేడి ఇడ్లీలో సాంబార్ వేసుకుని తింటే ఆ మజానే వేరు. అది సరే కానీ అసలు ఇంత రుచికరమైన, అద్భుతమైన సాంబార్ పుట్టుక ఎప్పుడు జరిగింది? అసలు దీనికి ఆద్యం పోసింది ఎవరు? తొలిసారిగా సాంబార్ ఎప్పుడు తయారు చేశారు?

సాంబార్ అంటే ఇష్టపడని వారు ఉండరేమో. హోటల్స్ లో డైలీ ఎన్ని కూరలు ఉన్నా సాంబార్ ఉండాల్సిందే. శుభకార్యాల్లో విందు భోజనాలప్పుడు సాంబార్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సాంబార్ కి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు మనవాళ్ళు. వేడి వేడి ఇడ్లీలో సాంబార్ వేసుకుని తింటే ఆ మజానే వేరు. అది సరే కానీ అసలు ఇంత రుచికరమైన, అద్భుతమైన సాంబార్ పుట్టుక ఎప్పుడు జరిగింది? అసలు దీనికి ఆద్యం పోసింది ఎవరు? తొలిసారిగా సాంబార్ ఎప్పుడు తయారు చేశారు?

సౌత్ వాళ్ళు ఇష్టపడే సాంబార్‌ని తొలిసారిగా ఎవరు తయారు చేశారో తెలుసా?

ఎంతో ఇష్టపడి తినే ఈ సాంబార్ వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇప్పుడు మనం తినే సాంబార్ కి, అప్పట్లో ఉన్న సాంబార్ కి రుచిలో చాలా తేడా ఉందని చెబుతారు. సాంబార్ యొక్క అసలైన వంటకం 1681 నుంచి 1689 వరకూ పాలించిన మరాఠా రాజు ఛత్రపతి శివాజీ కుమారుడు.. మరాఠా సామ్రాజ్య రెండవ చక్రవర్తి అయిన శంభాజీ భోస్లే కాలంలో గుర్తించవచ్చునని చరిత్రకారులు చెబుతారు. అయితే శంభాజీ మహారాజ్ ప్రధాన వంటవాడు ఒకరోజు సెలవు పెట్టాడు. దీంతో శంభాజీ తన వంట తానే చేసుకోవాలి అని అనుకున్నారు. తన కోసం పప్పు తయారు చేసుకోవాలి అని అనుకున్నారు. ఆయన తన వంటశాలలోకి వెళ్లి.. అమ్టి అనే ఒక రకమైన పప్పు కూరని వండడానికి అవసరమైన పదార్థాలను సేకరిస్తున్నారు.

ఈ అమ్టి అనేది నీరు ఉండి కొంచెం ఘాటుగా ఉంటుంది. అయితే శంభాజీ వంటకంతో ప్రయోగం చేయాలనుకున్నారు. కమ్మటి రుచి కోసం కందిపప్పు బదులు పెసరపప్పు వేశారు. అలానే కోకుం బదులు చింతపండు వేశారు. కోకుం అనేది ఎసిడిటీని తగ్గించే ఒక మొక్క పండు. ఘాటు కోసం వాడతారు. దీని బదులు ఆయన చింతపండు వేశారు. మొత్తానికి ఒక వంటకాన్ని అయితే తయారు చేశారు. రుచి అద్భుతంగా వచ్చింది. ఆ వంటకాన్ని రాజదర్బార్ లో ఉన్న వాళ్ళకి వడ్డించారు. వాళ్ళు ఆ వంటకాన్ని తిని చాలా రుచిగా, అద్భుతంగా ఉందని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత దానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచించి.. శంభాజీ ముద్దు పేరునే పెట్టారు. శంభాజీ మహారాజ్ ని ముద్దుగా శంభా అని పిలిచేవారట. శంభా, శంభా చేసిన ఆహార్.. ఈ రెండూ కలిపితే శంభాహార్ అని పెట్టారు. అలా ఆ పేరు కాస్తా సాంబార్ గా మారిందని చెబుతారు.

అయితే ఇంకో కథ కూడా ఉంది. తంజావూరులోని మరాఠా పాలకుల వంటశాలలో షాజీ అనే వంట మనిషి పప్పు వండుతున్నారు. అప్పట్లో పప్పులో రేగి పండ్లు వేసుకునేవారు. అయితే ఆ సమయంలో పప్పులో వేయడానికి రేగి పండ్లు లేకపోవడంతో చింతపండుని వేశారట. దీంతో పాటు కొన్ని కూరగాయలు కూడా వేశారు. తంజావూరు పర్యటనకు వచ్చిన శంభాజీ వంటశాలకు వచ్చారు. ఆయనకు ఆ వంటకం వాసన బాగా నచ్చింది. దీంతో ఆయనకు ఆ వంటమనిషి ఆ సాంబార్ ని వడ్డించారని.. ఆ వంటకానికి శంభాజీ ఫిదా అయిపోయారని చెబుతారు. ఇదొక కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ రెండు కథల్లో కామన్ పాయింట్ ఏంటంటే.. శంభాజీ ముద్దు పేరు అయిన శంభా పేరు మీదనే పెట్టారని చెబుతారు.

దక్షిణాది వారు ఎక్కువగా ఇష్టపడే సాంబార్ కి ఆద్యం పోసింది మాత్రం నార్త్ వాళ్ళే. చరిత్రలో ప్రచారంలో ఉన్న రెండు కథల ప్రకారం నార్త్ కి చెందిన శంభాజీ మహారాజ్ చేయడం వల్ల సాంబార్ వెలుగులోకి రావడం ఒకటి.. రెండు తంజావూరు వంటశాలలో పని చేసే స్థానిక వంట మనిషి చేసిన ఈ వంటకానికి శంభాజీ మహారాజ్ ముద్దు పేరు పెట్టడం వల్ల పాపులర్ అవ్వడం. ఓవరాల్ గా ఉత్తరాది మహారాజు ముద్దు పేరు మీద సాంబార్ వంటకం పుట్టడం.. అది దక్షిణాదిన కింగ్ ఆఫ్ ఆల్ కర్రీస్ గా అయ్యింది. ఈ సాంబార్ లో ప్రస్తుతం 20 రకాల సాంబార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మహారాష్ట్ర వారు చేసుకునే సాంబార్ కి, దక్షిణాది వాళ్ళు చేసుకునే సాంబార్ కి తేడా ఉంది. మహారాష్ట్ర వాళ్ళు చేసుకునేది బేసిక్ వెర్షన్ అయితే మనవాళ్ళు చేసుకునేది ప్రో వెర్షన్. కొబ్బరి తురుము, కూరగాయలు, మునగకాయలు, ఆనబకాయ, బంగాళాదుంపలు, వంకాయలు వేస్తారు.