హైటెక్ బెగ్గర్.. ఇలా కూడా అడుక్కుంటారా?

దేశంలో ధనవంతులు ఉన్నట్లే.. బిచ్చగాళ్లు ఉన్నారు. అనాధలు, ఆర్థిక పరిస్థితులు కొందర్ని బిచ్చగాళ్లగా మార్చింది. నిత్యం రైల్వే స్టేషన్, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇదొక మాఫియాగా మారిపోయింది. కొందరు ముఠాగా ఏర్పడి.. చిన్నపిల్లల్ని, పసిబిడ్డల్ని వ్యాపార వస్తువుల్ని చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. బిచ్చగాళ్లలో కూడా కోటీశ్వరులు ఉన్నారు. సాధారణంగా బిచ్చగాళ్లు అనగానే ఎలా ఉంటారు. చినిగిన బట్టలు, చింపిరి జుట్టు, అర్థకలితో కడుపు, కళ్లలో దీనత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చెప్పుకొబోయే యాచకుడు మాత్రం రిచ్ లుక్‌లో అడుక్కుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. రూ. 50 కన్నా తక్కువ బిచ్చం తీసుకోని హైటెక్ బిచ్చగాడు ఆయన.

ఇంతకు ఆ యాచకుడిది ఎక్కడంటే బీహార్. బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్‌లో రాజు ప్రసాద్ అనే బిచ్చగాడి పరిస్థితి వేరు. చక్కగా మెడలో బంగారం చైన్, చేతిలో 25 వేలు విలువ చేసే ట్యాబ్, మెడలో క్యూ ఆర్ కోడ్‌తో దర్జాగా బిక్షాటన చేస్తాడు. ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ బిచ్చగాడు.. ట్యాబ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తాడు. అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను తన తండ్రి అని చెప్పుకుంటాడు. లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, బెట్టియా పర్యటనకు రాగా, రాజు అతన్ని కలిసి..పాపాజీ అని పిలిచారట. తన కష్టాన్ని చెప్పగా.. రాజుకు బీహార్ అంతటా ఉచితంగా రైల్వేలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఆయన్ను తండ్రిగా భావిస్తారట రాజు.

అలాగే  కరోనా సమయంలో.. ఎవ్వరు బయటకు రాని పరిస్థితుల్లో తాను సాధువుగా మారిపోయానని చెప్పారు రాజు. తాను ప్రజల నుండి అడుక్కున్న డబ్బులతో శ్యాంసంగ్ ట్యాబ్ తీసుకున్నానని పేర్కొన్నారు. అలాగే స్టేషనల్లోని షాపుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానర్ లను చూసి డిజిటల్ లావాదేవీల గురించి తెలుసుకున్నానని తెలిపారు. స్థానిక దుకాణాదారులు.. అతడి కోసం ఖాతాను సృష్టించి, క్యూఆర్ కోడ్‌తో కూడిన స్కానర్‌ను అందించారు. ఇంకే విషయమేమిటంటే.. ఆయన జేబులో సుమారు 10 నుండి పదివేల క్యాష్ కూడా ఉంటుందట. అయితే ఇప్పుడు నోట్లు వేయడం మానేయడంతో.. ఆన్ లైన్ లావాదేవీలు ఎక్కువ కావడంతో.. హై టెక్నాలజీ అందిపుచ్చుకుని.. హైటెక్ బెగ్గర్ గా మారిపోయాడు రాజు.

Show comments