iDreamPost
android-app
ios-app

బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణుడిని వివాహమాడిన మహిళ! ఎక్కడంటే?

  • Published Apr 20, 2024 | 2:19 PM Updated Updated Apr 20, 2024 | 2:19 PM

Women Married Lord Krishna: భారత దేశంలో హిందువులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎంతో భక్తితో కొలుస్తారు. కొంతమంది మహిళలు కృష్ణుడిని తమ దేవుడిగానే కాదు.. భర్తగా భావిస్తుంటారు.

Women Married Lord Krishna: భారత దేశంలో హిందువులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎంతో భక్తితో కొలుస్తారు. కొంతమంది మహిళలు కృష్ణుడిని తమ దేవుడిగానే కాదు.. భర్తగా భావిస్తుంటారు.

  • Published Apr 20, 2024 | 2:19 PMUpdated Apr 20, 2024 | 2:19 PM
బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణుడిని వివాహమాడిన మహిళ! ఎక్కడంటే?

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి ఉండాలని దీవిస్తారు. పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత ముందుకు వెళ్తారు.  అబ్బాయి, అమ్మాయి ఇష్టా ఇష్టాలు.. వారి అభిప్రాయాలు తెలుసుకొని నిశ్చితార్థం జరిపిన తర్వాత పెళ్లి వేడుక ఘనంగా జరిపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో తాము పెళ్లి చేసుకోబోయే జీవిత భాగస్వామి అందం, మంచి పర్సనాలిటి, చదువు, ఉద్యోగం అన్ని విషయాల జాగ్రత్తలు తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. అలాంటింది ఓ యువతి అందరినీ ఆశ్చర్యపరుస్తూ శ్రీకృష్ణుడిని వివాహం చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ లో ఓ విచిత్రం సంఘటన చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఆరాధించే దేవాన్ని పెళ్లి చేసుకుంది ఓ యువతి. వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ కి చెందిన శివాని పరిహార్ కి శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రేమ. ఎప్పుడూ ఆయన ప్రతిమను తన దగ్గరు ఉంచుకునేది. యుక్త వయసు వచ్చిన తర్వాత తాను శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంటాని చెప్పేదట. మొదట్లో ఆమె మాటలు పెద్దగా పట్టించుకోకున్నా.. తర్వాత కృష్ణుడిపై ఆమె పెంచుకున్న మమకారం, ప్రేమ, పట్టుదల చూసి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ బద్దంగా అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది శివాని పరిహార్.

వివాహమహోత్సవం తర్వాత వధువు తరుపు బంధువులు అప్పగింతల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆసక్తికర పెళ్లిని చూసేందుకు స్థానికంగా ఉన్న జనాలు తరలివచ్చారు. వివాహం తంతు పూర్తయిన తర్వాత ఇద్దిరికీ వివాహ ప్రమాణ పత్రం కూడా వచ్చింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురు శివాని పరిహార్ మాట్లాడుతూ.. ‘నా సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు.. నా కల నెరవేరింది.. నాకు చిన్ననాటి నుంచి కన్నయ్య అంటే ఎంతో ఇష్టం.. ఆయనే నాకు భర్తగా రావాలని బలమైన కోరిక ఉండేది. అందుకే నాకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్నా.. ఇక పై స్వామి వారి సేవలో బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో ఉంటా’ అని శివాని చెప్పింది. దీనికి సంబంధించి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom