iDreamPost
android-app
ios-app

గర్ల్ ఫ్రెండ్ నిజ స్వరూపం తెలిసి.. సరిగ్గా పెళ్లిరోజే ప్రతీకారం! ఏం చేశాడంటే?

  • Published Jun 12, 2024 | 8:50 AM Updated Updated Jun 12, 2024 | 8:50 AM

తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడంతో.. సరిగ్గా పెళ్లి రోజే ప్లాన్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. దాంతో తెల్లమెుఖం వేసింది ఆమె. ఇంతకీ ఏం జరిగింది? అతడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడంతో.. సరిగ్గా పెళ్లి రోజే ప్లాన్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. దాంతో తెల్లమెుఖం వేసింది ఆమె. ఇంతకీ ఏం జరిగింది? అతడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Published Jun 12, 2024 | 8:50 AMUpdated Jun 12, 2024 | 8:50 AM
గర్ల్ ఫ్రెండ్ నిజ స్వరూపం తెలిసి.. సరిగ్గా పెళ్లిరోజే ప్రతీకారం! ఏం చేశాడంటే?

ఓ వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాలు అంగీకారంతో పెళ్లికి కూడా సిద్ధమైయ్యారు. ఇక వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందరూ హాజరైయ్యారు. ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో గర్ల్ ఫ్రెండ్ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు ఆ వరుడు. ఈ ఊహించని పరిణామానికి షాక్ కు గురైంది ఆ అమ్మాయి. అందరి ముందు తన పరువుపోవడంతో.. తెల్లమెుఖం వేసింది సదరు యువతి. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ గా మారింది.

పెళ్లికి నమ్మకమే పునాది. ఆ నమ్మకాన్ని కోల్పోయిన రోజున ఆ జంట విడిపోవడం ఖాయం. అలా నమ్మకాన్ని వమ్ముచేసి మోసం చేయాలనుకున్న యువతికి తగిన బుద్ధి చెప్పాడు ఓ యువకుడు. అసలేం జరిగిందంటే? 2019లో చైనాలో జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఇది తెలిసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే? తన గర్ల్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసిన ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయాడు. అయితే పెళ్లిరోజు వరకు ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. పెళ్లిరోజు రానే వచ్చింది. పెళ్లి వేడుక పక్కనే ఓ స్క్రీన్ ఏర్పాటు చేసి వారి పాత వీడియోలు ఒక్కొక్కటిగా ప్లే చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సరిగ్గా పెళ్లి జరగ్గానే వధువుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ప్లే అయ్యింది. దాంతో ఆ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. ఇంతకీ ఆ వీడియో ఏముందంటే? ఆ వధువు తన బావతో సన్నిహితంగా ఉన్న క్షణాలు ఆ వీడియోలో ఉంది. ఇది చూసిన వధువు ఒక్కసారిగా బిక్కమెుఖం వేసింది. నన్నే మోసం చేద్దామనుకున్నావా? నాకేమీ తెలీదు అనుకుంటున్నావా? అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు వరుడు. దాంతో కోపంతో ఆమె బొకేన్ అతడికేసి కొట్టింది. అయితే అంతకు ముందు వరుడు ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వాటి పనితీరును చెక్ చేస్తున్న క్రమంలో ఈ అఫైర్ బయటపడింది. దాంతో టైమ్ చూసుకుని ఆమెకు బుద్ధిచెప్పాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio