iDreamPost
android-app
ios-app

బామ్మపై మనవడి ప్రేమ.. గిఫ్టుగా ఏకంగా రూ. 12 కోట్లు విలువ చేసే లగ్జరీ కారు

  • Published Nov 18, 2024 | 5:17 PM Updated Updated Nov 18, 2024 | 5:17 PM

బామ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మనవడు. ఏకంగా 12 కోట్లు విలువ చేసే మెక్ లారెన్ కారును ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ కారు కొనడానికి కారణం ఏంటంటే?

బామ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మనవడు. ఏకంగా 12 కోట్లు విలువ చేసే మెక్ లారెన్ కారును ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ కారు కొనడానికి కారణం ఏంటంటే?

  • Published Nov 18, 2024 | 5:17 PMUpdated Nov 18, 2024 | 5:17 PM
బామ్మపై మనవడి ప్రేమ.. గిఫ్టుగా ఏకంగా రూ. 12 కోట్లు విలువ చేసే లగ్జరీ కారు

బామ్మలకు తమ మనవళ్లపై ఎనలేని ప్రేమ ఉంటుంది. మనవళ్లను గారాబంగ చూసుకుంటారు. వారు ఏదడిగినా కాదనరు. మనవళ్లు ఎంత ఎదిగినా ఒళ్లో బుజ్జాయిల మాదిరిగానే చూస్తారు బామ్మలు. బామ్మలు, మనవళ్ల మధ్య ఉండే ఆ బాండింగే వేరు. తమ మనవడు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా వెనకేసుకొస్తుంటారు. మనవడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి ఏదైనా జరిగితే తట్టుకోలేరు. మనవళ్లు ఎదుగుతుంటే బామ్మల ఆనందానికి హద్దే ఉండదు. మనవళ్ల బర్తుడేలకి సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు. ఖరీదైన బహుమతులు అందించి మనవళ్ల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు బామ్మలు మనవళ్ళ కోసం గిఫ్టులు ఇవ్వడమే చూశాం.

కానీ మనవళ్లు బహుమతులు ఇవ్వడం అరుదుగా జరిగేదే అని చెప్పాలి. కానీ ఓ మనవడు తన బామ్మ కోసం ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇయ్యని ఖరీదైన గిఫ్టును ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. బామ్మ కోసం ఏకంగా రూ. 12 కోట్లు విలువ చేసే లగ్జరీ కారును కొనిచ్చి బామ్మపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు ఓ యంగ్ బిజినెస్ మ్యాన్. అయితే ఈ లగ్జరీ కారును కొనడానికి గల కారణం లేకపోలేదు. ఇది వరకు ఉన్న పోర్షియో కారులో తిరిగేటప్పుడు దాని డోరు తీసుకుని దిగాల్సి వస్తుందని.. ఆటోమేటిక్ గా తెరుచుకునే డోర్లు కలిగిన కారు కావాలని ఆ బామ్మ అడగడమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ బామ్మకు మనువడి పోర్షియో కారు నడిపి బోరు కొట్టింది. ఆ కారులో తిరగాలంటే చిరాకు వస్తుందని మనవడితో చెప్పింది.

లగ్జరీ కారైన మెక్ లారెన్ కారును కొనివ్వరాదు అని మనవడిని కోరింది. ఆ కారులో మా ఫ్రెండ్స్ తో కలిసి తిరిగొస్తా అని చెప్పింది. బామ్మ ఆనందాన్ని కాదనలేని బిజినెస్ మ్యాగ్నెట్ అయిన మనవడు మెక్ లారెన్ కారును కొనిచ్చేందుకు సరే అన్నాడు. కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఆ కారును కొనేశాడు. రూ. 12 కోట్లు పెట్టి మెక్ లారెన్ కారును కొని బామ్మకు బహుమతిగా ఇచ్చాడు. మనవడు ఇచ్చిన గిఫ్ట్ చూసి బామ్మ తెగ సంబరపడిపోయింది. ఆ కారులో తన ఫ్రెండ్స్ తో కలిసి చెక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నది.

కాగా మెక్ లారెన్ 765 ఎల్టీ కారు ఇటీవలే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. లగ్జరీ వసతులతో, అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది. పూర్తి కార్బన్ ఫైబర్ తో తయారయిన ఈ కారు డోర్లు బటన్ నొక్కితే 11 సెకన్లలో అప్పర్ డైరెక్షన్ లో ఓపెన్ అవుతాయి. బామ్మకు ప్రధానంగా ఈ ఫెసిలిటీయే బాగా నచ్చిందని ఆ కారుకు ఇండియా డీలర్ ఆనంద్ తన ఇన్స్టా ఐడీలో వెల్లడించారు. బామ్మపై ఇంత ప్రేమ చూపిన మనవడిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి బామ్మకోసం రూ. 12 కోట్లు విలువ చేసే కారు కొన్న మనవడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş