Ayodhya Ram Mandir: అయోధ్య వేడుక వేళ.. పేరులో రాముడుంటే అదిరిపోయే ఆఫర్!

అయోధ్య వేడుక వేళ.. పేరులో రాముడుంటే అదిరిపోయే ఆఫర్!

Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకను చూసేందు కోట్లాది మంది ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ అధికారులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకను చూసేందు కోట్లాది మంది ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ అధికారులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

త్రేతాయుగంలో అయోధ్యనగరాన్ని శ్రీరామ చంద్రుడు పాలించే వారు. అప్పట్లో రామయ్య  పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాక ఆ కార్యక్రమం గురించి అందరూ కథలుగా చెప్పుకునేవారు. రామరాజ్యం అంటే ఇది అంటూ స్పూర్తిగా ఆయన పాలను తీసుకునే వారు. కొన్నివేల సంవత్సరాల తరువాత అయోధ్య నగరంలో మళ్లీ అలాంటి శోభనే కనిపిస్తోంది. తాజాగా ఈ కలియుగంలో జనవరి 22న  అయోధ్య నగరంలో రాములోరు కొలువు దీరనున్నారు. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ యోగి సర్కార్ జనవరి 22న పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే పలు వ్యాపార సంస్థలు, హోటల్లు సైతం ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా గోరఖ్ పూర్ అధికారులు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది కూడా పేరులో రాముడు ఉన్నవారికే ఆఫర్ వర్తిస్తుంది.

గోరఖ్ పూర్ లో షహీద్ అప్షాక్ ఉల్లా ఖాన్ అనే జూలాజికల్ పార్క్ ఉంది. అక్కడి రోజూ పెద్ద సంఖ్యలలో పర్యాటకులు వస్తుంటారు. ఆ ప్రాంతంలో షహీద్ అప్షాక్ ఉల్లా  ఖాన్ జూ పార్క్ మంచి గుర్తింపు ఉంది. జనవరి 22న అయోధ్య రామయ్య ప్రతిష్టా కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క రోజు  ముందు అంటే జనవరి 21 తేదీన ఆ జూలాజికల్ పార్క్ అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని పదం ఉంటే చాలు వారు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. జూకు వచ్చే వారిలో రాము అనే పేరు ఉంటే వారికి ప్రవేశ రుసుములో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.

అయితే ఈ ఆఫర్‌ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ ప్రభుత్వం నుంచి పొందిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా జంతు ప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు ఉంటుంది. అయితే రాబోయే సోమవారం నాడు జులాజికల్ పార్క్ ప్రవేశ ద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి..గోరఖ్ పూర్ జూ పార్క్ అధికారులు ఇచ్చిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments