iDreamPost
android-app
ios-app

వీడియో: ఓపెన్ కారులో డ్యాన్స్ చేస్తూ నడిరోడ్డుపై యువతి హల్ చల్! నెటిజన్లు ఫైర్

  • Published Jan 08, 2024 | 3:04 PM Updated Updated Jan 08, 2024 | 3:04 PM

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి యువత తమ టాలెంట్ చూపించుకోవడం కోసం ఎన్నో రకాల వీడియోలు చేస్తున్నారు. కొన్ని వీడియోలు ప్రాణాల మీదకు తెస్తున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. కొంతమంది రీల్స్ చేస్తూ పాపులర్ కాావాలని చూస్తున్నారు.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి యువత తమ టాలెంట్ చూపించుకోవడం కోసం ఎన్నో రకాల వీడియోలు చేస్తున్నారు. కొన్ని వీడియోలు ప్రాణాల మీదకు తెస్తున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. కొంతమంది రీల్స్ చేస్తూ పాపులర్ కాావాలని చూస్తున్నారు.

  • Published Jan 08, 2024 | 3:04 PMUpdated Jan 08, 2024 | 3:04 PM
వీడియో: ఓపెన్ కారులో డ్యాన్స్ చేస్తూ నడిరోడ్డుపై యువతి హల్ చల్! నెటిజన్లు ఫైర్

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అనుభవం లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అదుపుతప్పి ప్రమాదాలకు గురి అవుతున్నాయని.. వారి నిర్లక్ష్యానికి ఎంతోమంది అమాయకులు బలి కావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇందుకోసం ట్రాఫిక్ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.  భారీగా చలాన్లు విధిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయినా మార్పు రావడం లేదు.  ఇక బైకులు, కార్లతో యువత చేసే విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రమాదం అని తెలిసినా.. డేంజరస్ విన్యాసాలు చేస్తూ.. వారి ప్రాణాతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ఫణంగా పెడుతున్నారు. ఓ యువతి ఓపెన్ టాప్ కార్లు లో నానా హంగామా చేసింది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా వచ్చినప్పటి చిత్ర విచిత్రమైన వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొంతమంది వెరైటీ వీడియోలతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయిన సందర్బాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యువత ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సాంగ్స్ పాడటం, డ్యాన్స్ చేయడం, డెంజరస్ స్టంట్స్ తో ఊదరగొడుతున్నారు. ఇందులో కొన్ని క్లిక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక రీల్స్ గురించి ప్పరత్యేకంగా చెప్పనక్కరలేదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రీల్స్ తో దుమ్మురేపుతున్నారు. చాలా వరకు రీల్స్ కామెడీగా ఉంటాయి.. కానీ కొన్ని రీల్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువతి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

వీడియోలో రద్దీగా ఉన్న ప్రదేశంలో బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ లో ఉన్న యువతి ఓపెన్ టాప్ కారులో డ్యాన్స్ చేస్తూ వెళ్తుంది. ఓ వ్యక్తి కారు నడుపుతుండాగా.. యువతి చేతులు ఊపుతూ డ్యాన్స్ చేస్తూ నానా రచ్చ చేసిది. ఆ కారు వెంట వెళ్లున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతే క్షణాల్లో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ యువతి మద్యం సేవించి ఉందని.. అందుకే అలా డ్యాన్స్ చేస్తుందని కామెంట్స్ చేశారు. నడి రోడ్డుపై అలా డ్యాన్స్ చేస్తే వాహనదారుల దృష్టి మళ్లి ప్రమాదాలు జరుగుతాయి.. ఇలాంటి వారిని శిక్షించాలని అంటూ కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by EPIC MEME | NEWS – Ankur Raghav (@_epic69)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet