iDreamPost
android-app
ios-app

వీడియో: వాకింగ్‌కు డుమ్మా.. ఫ్రెండ్స్ ఎంత పని చేశారో చూడండి!

  • Published Nov 02, 2023 | 2:45 PM Updated Updated Nov 02, 2023 | 2:45 PM

నలుగురు స్నేహితులు ఒక్కచోట చేరారంటే ఆ అల్లరి వేరే లెవల్లో ఉంటుంది. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ, ఆటపట్టించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఎన్నో ఏళ్లనుంచి వాకింగ్ చేస్తున్నారు కొందరు ఫ్రెండ్స్.

నలుగురు స్నేహితులు ఒక్కచోట చేరారంటే ఆ అల్లరి వేరే లెవల్లో ఉంటుంది. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ, ఆటపట్టించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఎన్నో ఏళ్లనుంచి వాకింగ్ చేస్తున్నారు కొందరు ఫ్రెండ్స్.

  • Published Nov 02, 2023 | 2:45 PMUpdated Nov 02, 2023 | 2:45 PM
వీడియో: వాకింగ్‌కు డుమ్మా.. ఫ్రెండ్స్ ఎంత పని చేశారో చూడండి!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో రకరకాల వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. అందులో కొన్ని బాధాకరమైనవి ఉంటే మరికొన్ని సంతోషకరమైనవి ఉంటాయి. ఈ క్రమంలో కొందరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఫన్నీ సంఘటన నెట్టింటా తెగ వైరల్ గా మారింది. తమ స్నేహితుడు ప్రతిరోజు వాకింగ్ కు డుమ్మా కొడుతున్నాడని కలలో కూడా ఊహించని పని చేశారు ఆ స్నేహితులు. ఏకంగా బ్యాండ్ మేళంతో ఇంటికి వెళ్లి ఆ మిత్రుడికి షాకిచ్చారు. బ్యాండ్ బాజాలు మోగిస్తూ వాకింగ్ కు ఆహ్వానించారు. ఇది చూసిన నెటిజన్లు మీరెక్కడి ఫ్రెండ్స్ రా బాబూ ఇలా తగులుకున్నారు.. అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కాలం మారుతోది. మానవ జీవనశైలిలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు ఇలా ప్రతిఒక్కటి కలుషితమై పోతున్నాయి. దీంతోపాటు శారీరక శ్రమ చేయకపోవడంతో అనారోగ్యాలకు గురవుతున్నారు పలువురు వ్యక్తులు. ఈ క్రమంలోనే వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఓ ప్రాంతంలో కొందరు స్నేహితులు ప్రతిరోజు వాకింగ్ కు వెళ్లేవారు. ఇలా సాగిపోతున్న క్రమంలో అందులో ఓ స్నేహితుడు వాకింగ్ కు వెళ్ల కుండా డుమ్మా కొట్టడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన తక్కిన ఫ్రేండ్స్ వినూత్నంగా ఆలోచించి ఫ్రెండ్ ను వాకింగ్ కు ఆహ్వానించిన తీరు నవ్వులు పూయిస్తోంది.

నలుగురు స్నేహితులు ఒక్కచోట చేరారంటే ఆ అల్లరి వేరే లెవల్లో ఉంటుంది. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ, ఆటపట్టించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఎన్నో ఏళ్లనుంచి వాకింగ్ చేస్తున్నారు కొందరు ఫ్రెండ్స్. అయితే వారిలో చాలా మంది క్రమం తప్పకుండా వాకింగ్ కు వెళ్తుంటారు. మరికొంతమంది రోజు వెళ్తామనే ప్లాన్ చేసుకుంటారు కాని వెళ్లలేరు. అలాంటి ఫ్రెండ్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మిగిలిన ఫ్రెండ్స్. అలా వాకింగ్ మానేసిన ఓ వ్యక్తి ని తన ఫ్రెండ్స్ ని వాకింగ్ ఆహ్వానించిన విధానం చూస్తే నవ్వాగదు. ఉదయం వేళ ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్స్ బ్యాండ్ మేళాలతో ఇంటికి వెళ్లారు. ఇది చూసి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఒరేయ్ ఆపండ్రా బాబూ వాకింగ్ కు వస్తాలే అంటూ దండం పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet