iDreamPost
android-app
ios-app

ఆమె పేరుకి సెలబ్రెటీ! చేసేవన్నీ అశ్లీల పనులు! ఇప్పుడు పోలీసులకి చిక్కింది!

  • Published May 30, 2024 | 1:26 PM Updated Updated May 30, 2024 | 1:26 PM

Female Youtuber: ఈ మధ్య కొన్ని ఛానల్స్ లైకులు, షేర్ల కోసం ఇష్టానుసారంగా విజృంభిస్తున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే మరీ ఘోరంగా అశ్లీలంగా మాట్లాడటం.. జుగుప్స కలిగించే ప్రశ్నలు వేస్తూ ఫ్రాంక్ ల పేరిట వేధించడం చూస్తూనే ఉన్నాం.

Female Youtuber: ఈ మధ్య కొన్ని ఛానల్స్ లైకులు, షేర్ల కోసం ఇష్టానుసారంగా విజృంభిస్తున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే మరీ ఘోరంగా అశ్లీలంగా మాట్లాడటం.. జుగుప్స కలిగించే ప్రశ్నలు వేస్తూ ఫ్రాంక్ ల పేరిట వేధించడం చూస్తూనే ఉన్నాం.

ఆమె పేరుకి సెలబ్రెటీ! చేసేవన్నీ అశ్లీల పనులు! ఇప్పుడు పోలీసులకి చిక్కింది!

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. ఆ మధ్య టిక్ టాక్ లో చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ చూపిస్తూ వీడియోలు తీస్తూ తెగ సందడి చేశారు. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత రీల్స్ చేస్తూ ఊదరగొడుతున్నారు.ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు  ఫ్రాంక్ వీడియోలు అంటూ జనాల మతులు పోగొడుతున్నారు. ఏది అసలు.. ఏది నిజం అనేది తెలియకుండా పోతుంది. డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలు చేస్తూ వారి ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అది ఓ యువతి ఆత్మహత్యకు కారణం అయింది.. దీంతో చానల్ టీమ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోట్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఈ మధ్య కొంతమంది వల్గర్ కంటెంట్ తో చానల్స్ నడుపుతున్నారు. డబుల్ మీనింగ్ మాట్లాడుతూ, అశ్లీల వ్యాఖ్యలతో ఇంటర్వ్యూలో చేస్తూ ఓ యువతి ఆత్మహత్యకు కారణం అయిన కేసులో యూట్యూబ్ ఛానల్ టీమ్ ని అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. అరెస్ట్ అయిన వారు వీజే ఆర్ శ్వేత(23), వీడియో జాకీ ఎస్ యోగరాజ్ (21), నిర్వాహకుడు రామ వీరప్పన్ (21) గా గుర్తించారు పోలీసులు. వీరు ‘వీరా టాక్స్ డబుల్ ఎక్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు.ఈ ఛానల్ వారు రోడ్డుపై వెళ్తున్న యువతీ యువకులు చివరికి మైనర్లను ఇంటర్వ్యూ చేస్తూ బూత ప్రశ్నలు అడుగూ వెకిలి నవ్వులు నవ్వుతూ హల్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ యువతితో ఇంటర్వ్యూ తీసుకున్నారు.. ఆమె ప్రమేయం లేకుండా వీడియో అప్ లోడ్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంజనీరింగ్ చదువుతున్న ఆ యువతి అవమానంగా ఫీల్ అయ్యింది. బిస్కెట్ లో ఎలుకల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అద గమనించి వెంటనే కిల్‌పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ‘వీరా టాక్స్ డబుల్ ఎక్స్’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఛానల్ లో అశ్లీల వ్యాఖ్లయతో కూడిన వీడియోలు కోకొల్లలుగా ఉన్న కారణంగా ఛానల్ ని సీజ్ చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అందంగా ఉంటూ.. కాస్త సెలబ్రెటీల హోదా రాగానే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కటకటాలు లెక్కించాల్సిందే అని నెటిజన్లు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chennai Live (@chennailive1048)