బిగ్‌ స్క్రీన్ పై ఎన్నికల రిజల్ట్స్ లైవ్.. ఏఏ థియేటర్లలో అంటే..?

Election Results Live: ఇప్పటి వరకు ప్రపంచ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లు ప్రసారం చేసిన సినిమా ధియేటర్లు ఇప్పుడు కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈసాని ఎన్నికల ఫలితాలు ధియేటర్లో లెవ్ చేయబోతున్నారు.

Election Results Live: ఇప్పటి వరకు ప్రపంచ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లు ప్రసారం చేసిన సినిమా ధియేటర్లు ఇప్పుడు కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈసాని ఎన్నికల ఫలితాలు ధియేటర్లో లెవ్ చేయబోతున్నారు.

దేశ వ్యాప్తంగా అందరూ జూన్ 4 వ తేదీ గురించి ఎంతో ఉత్కంఠంగా.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాల్లో అధికారాలు ఎవరు దక్కించుకుంటున్నారు.. ఎవరు కోల్పోతున్నారు అన్న విషయం తెలిసిపోయే రోజు.. ఎన్నికల ఫలితాల గురించి రాజకీయ నేతలే కాదు.. సామాన్యులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 న ఈవీఎం లలో నేతల భవితవ్యం తెలనుంది. ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎన్నీ సీట్లు రాబోతున్నాయి? కేంద్రంలో మళ్లీ మోడీ అధికారం చేపడతారా? రాహూల్ ఛాన్స్ దక్కించుకుంటాడా? ఏపీలో మరోసారి వైసీపీ అధికారం దక్కించుకుంటుందా? కూటమి మాయ చేస్తుందా? ఇలాంటి విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలను కొందరు ఎగ్జిబిటర్లు క్యాష్ చేసుకునేందుక కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ప్రపంచ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ ను ప్రసారం చేసిన సినిమా ధియేటర్లు ఇప్పడు ఎన్నికల ఫలితాలను కూడా ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నాయి. ఎన్నికల ఊపును క్యాష్ చేసుకునేందుకు మహరాష్ట్రలోని కొన్ని ధియేటర్ల యజమానులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. నేటితో (జూన్ 1) తో చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. జూన్ 4న కౌంటింగ్ కు ఈసీ రెడీ అయ్యింది.. ఆ రోజు ఎన్నికల ఫలితాలు ఎంతో ఉత్కంఠంగా ఉండబోతున్నాయి. చాలా మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఎన్నికల ఫలితాలు చూసే అవకాశం సినిమా ధియేటర్లలో కల్పించారు.. ఇందుకు పేటీఎంలో టికెట్లు సైతం విక్రయిస్తున్నారు. వీటిని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు చూసేందుకు సిద్దమైన ధియేటర్ల పేర్లు..ముంబై లోని ఎస్ఎం5 కళ్యాణ్, కంజూర్ మార్కగ్ మల్టీప్లెక్స్, ఠాణేలోని ఎటర్నిటి మాల్, సియాన్, వండర్ మాల్, నాగ్ పూర్ మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, పూణే మూవీ మ్యాక్స్ తదితర ధియేటర్లలో ఎన్నికల ఫలితాలు ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. రూ.99 నుంచి రూ.300 వరకు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ధియేటర్లు చాలా వరకు హౌజ్ ఫుల్ అయినట్లు తెలుస్తుంది. ఆర్ గంటల పాటు నాన్ – స్టాప్ గా ఫలితాలు లైవ్ లో చూపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే ఎంత బాగుటుందో అని అనుకుంటున్నారు ఓటర్ మహాశయులు.

Show comments