Demand for Helicopters: ఎన్నికల వేళ ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ కి ఫుల్ డిమాండ్! గంటకి అన్ని లక్షలా?

Demand for Helicopters: ఎన్నికల వేళ ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ కి ఫుల్ డిమాండ్! గంటకి అన్ని లక్షలా?

దేశంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రచారాలను ఉద్ధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారాలకు వినియోగించే హెలికాఫ్టర్లు, విమానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

దేశంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రచారాలను ఉద్ధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారాలకు వినియోగించే హెలికాఫ్టర్లు, విమానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికలు అనేవి అన్ని పార్టీలకు జీవన్మరణ పోరాటం. అందుకే వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సభలు నిర్వహిస్తూ.. ఎన్నికల సమరంలో దూసుకెళ్తుంటారు. దీని కోసం వారు హెలికాఫ్టర్లను వినియోగిస్తుంటారు. అందుకే ఎన్నికల సీజన్ వచ్చిందంటే..చాలు వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2024 లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలోనే  ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఇప్పటికే  తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అలానే ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇలా అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తూనే దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాలు చేసేందుకు ప్రణాళికు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రచారాలకు కాంగ్రెస్ , బీజేపీలు తెరతీశాయి. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీలతో పాటు మరికొని ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు పర్యటనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారాల ఉద్ధృతం చేయనున్నారు. దీని కోసం కోట్లాది రూపాయాలను ఖర్చు చేస్తుంటారు. ప్రయాణం కోసం కూడా భారీగానే డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా హెలికాప్టర్లు, జెట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో సభలకు హాజరయ్యేందుకు నేతలు హెలికాఫ్టర్లను వినియోగిస్తుంటారు. వీటి ద్వారా ఎక్కువ ప్రచారాల్లో పాల్గొనవచ్చు. అలానే రోడ్డు మార్గంలో ట్రాఫిక్, ఇతర సమస్యలతో పాటు అలసట లేకుండా ఉండేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తుంటారు. ఇలా సుడిగాలి పర్యటనలను చేసేందుకు  అన్ని పార్టీలు ప్రధాన నేతలు హెలికాప్టర్లను వినియోగిస్తుంటారు.

తాజాగా ఎన్నికల నేపథ్యంలో వీటికి పుల్ డిమాండ్ పెరిగింది. వివిధ విమానా సంస్థలు భారీగా ఛార్జీలు వస్తున్నాయి. గతంతో పోలీస్తే..  ఈ సారి వీటి ఛార్జీలు భారీగా పెరిగాయి. చార్టర్ విమానాలకు గంటకు 4.5 లక్షల నుంచి 5.25 లక్షలు ఛార్జీ చేస్తున్నాయి. అలానే హెలికాఫ్టర్లు  గంటకు రూ.1.5 లక్షల ఛార్జీ చేస్తున్నాయి. 2023 డిసెంబర్ నాటికి దేశంలో  112 నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి సేవలు అందిస్తుంటాయి. స్థిరంగా ఓ మార్గంలో సర్వీస్ లను నడపవు. ఈ సంస్థల దగ్గర దాదాపు 350 విమానాలు,  175 హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా.

వీటిల్లో చాలా వరకు పది కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నవే అని సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈసారి  డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలోనే గంటకు గరిష్టంగా రూ.3.5 లక్షల వరకు చెల్లించేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇలా దేశంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా వీటి వినియోగం కోసం భారీగానే  డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ హెలికాఫ్టర్లకు, విమానాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎన్నికల దగ్గర పడే కొద్ది వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణలు అభిప్రాయా పడుతున్నారు.

Show comments