iDreamPost
android-app
ios-app

ఐస్‌ గడ్డలో చనిపోయిన ఎలుక..! ఆ హోటళ్లో తిన్నవారి పరిస్థితి అంతే!

  • Published Apr 13, 2024 | 1:48 PM Updated Updated Apr 13, 2024 | 1:48 PM

రాను రాను బయట దొరికే ఆహార పదార్ధాలలో కల్తీ జరుగుతున్న సంగతులు గురించి వింటూనే ఉన్నాము. ఈ క్రమంలో ఇప్పుడు మరొక వార్త అందరిని కలవరపెడుతుంది. నిత్యం జ్యూస్ లలో వేసే ఐస్ లో ఏ విధంగా కల్తీ జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

రాను రాను బయట దొరికే ఆహార పదార్ధాలలో కల్తీ జరుగుతున్న సంగతులు గురించి వింటూనే ఉన్నాము. ఈ క్రమంలో ఇప్పుడు మరొక వార్త అందరిని కలవరపెడుతుంది. నిత్యం జ్యూస్ లలో వేసే ఐస్ లో ఏ విధంగా కల్తీ జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

  • Published Apr 13, 2024 | 1:48 PMUpdated Apr 13, 2024 | 1:48 PM
ఐస్‌ గడ్డలో చనిపోయిన ఎలుక..! ఆ హోటళ్లో తిన్నవారి పరిస్థితి అంతే!

ఇప్పుడు ఎవరికీ వారు అందరూ బిజీ బిజీగా బ్రతుకులు సాగిస్తున్నారు కాబట్టి.. బయట దొరికే ఆహార పదార్ధాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. సమయం లేకనో .. ఆ ఆహార పదార్ధాలు రుచి కోసమో ఇలా చేస్తున్నారు. అయితే, ఇప్పుడు బయట లభించే ఆహార పదార్ధాలు ఏ రకంగా కల్తీకి గురి అవుతున్నాయో చూస్తూనే ఉంటున్నాము. నిత్యం వాటికీ సంబంధించి ఎన్నో రకాల వార్తలు ప్రజలకు భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరొక వార్త అందరిని కలవరపెడుతోంది. తాజాగా ఓ ప్రముఖ సంస్థకు సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్ లు, గుట్కా లు దొరికిన విషయం మరువక ముందే.. హోటల్స్ లో సరఫరా చేసే.. ఐస్ లో ఒక మృతకళేభరం కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

హోటల్స్ లో.. రెస్టారెంట్స్ లో జరిగే కల్తీల గురించి అందరూ ఇప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అసలే సమ్మర్ అందరూ చల్లని పానీయాలను త్రాగేందుకు మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇకపై అలా త్రాగారో ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని జున్నార్ లోని ఒక ఐస్ ఫ్యాక్టరీ హోటల్స్ కు ఐస్ బ్లాక్స్ ను సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఐస్ బ్లాక్ లో చనిపోయిన ఎలుక కనిపించింది. దీనితో హోటల్స్ లో భోజనం చేసేవారికి ఇప్పుడు వారి వారి ఆరోగ్యాలపై ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలు హోటల్స్ లో.. ఈ ఫ్యాక్టరీ నుంచి ఐస్ బ్లాక్స్ వెళ్లాయి. ఈ ఘటన గురించి బయటకు రావడంతో.. వెంటనే అధికారులు ఆ సంస్థపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్నీ రాష్ట్ర ఆహార శాఖ మంత్రి ధర్మారావు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అసలే ఇప్పుడు వేసవి వచ్చేసింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలంతా చల్లని పానీయాలు త్రాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. బయట దొరికే ఫ్రూట్ జ్యూస్ లు , కూల్ డ్రింక్స్ మీదే అందరి మనసు మళ్ళుతూ ఉంటుంది. ఇక పండ్లు, డ్రై ఫ్రూట్ జ్యూస్, మిల్క్‌షేక్‌లు, చెరకు రసం ఇటువంటివి లభించే దగ్గర.. ఐస్ క్యూబ్స్ ను వేస్తూ ఉంటారు. ఎంతో మంది వీటిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఐస్ బ్లాక్స్ లో చనిపోయిన ఎలుక కనిపించడంతో.. ప్రజలంతా అప్రమత్తం అయ్యారు. బయట జరిగే కల్తీలు మరి ఈ రకంగా ఉంటున్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఇకనైనా ప్రజలంతా బయట హోటల్స్ లో, జ్యూస్ షాప్స్ వద్ద శీతల పానీయాలను త్రాగేటప్పుడు .. జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.