iDreamPost
android-app
ios-app

అంబానీకి అదృష్టం తెచ్చిన కోడలు..10 రోజుల్లోనే రూ.25 వేలకోట్లు!

Mukesh Ambani: ప్రపంచమంతా ప్రత్యేకంగా చెప్పుకునేలా ముకేశ్ అంబానీ..తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపించాడు. ఇది ఇలా ఉంటే.. కొత్త కోడలు వచ్చిన వేళ..అంబానీకి వేల కోట్ల లాభాలు వచ్చాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో

Mukesh Ambani: ప్రపంచమంతా ప్రత్యేకంగా చెప్పుకునేలా ముకేశ్ అంబానీ..తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపించాడు. ఇది ఇలా ఉంటే.. కొత్త కోడలు వచ్చిన వేళ..అంబానీకి వేల కోట్ల లాభాలు వచ్చాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో

అంబానీకి అదృష్టం తెచ్చిన కోడలు..10 రోజుల్లోనే రూ.25 వేలకోట్లు!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుక ఘనంగా  జరిగిన సంగతి తెలిసింది. ప్రపంచమంతా ప్రత్యేకంగా చెప్పుకునేలా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపించారు. దేశం, విదేశాల నుంచి ఎందరో ప్రముకలు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇక ఈ పెళ్లికి పెట్టిన ఖర్చు గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే..కొత్త కోడలు వచ్చిన వేళ..అంబానీకి అదృష్టం వచ్చింది. వేల కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రియలన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యాపారం చేయని రంగం అంటూ లేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి రంగంలోను తనదైన ముద్రను వేశారు అంబానీ. ఇది ఇలా ఉంటే.. గత ఐదు నెలల నుంచి అంబానీ ఇంట పెళ్లి సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో గుజరాత్ లోని జామా నగర్ లో ప్రీవెడ్డింగ్ కార్యక్రమం నుంచి ఇటీవల జూలై 12వ తేదీన జరిగిన పెళ్లి రోజు వరకు..అనేక అంశాలు సోషల్ మీడియాలో నిలిచాయి. అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జూలై 12న అత్యంత ఘనంగా నిర్వహించాడు. అలానే మంగళ ఉత్సవ్ సమయంలో ముఖేశ్ అంబానీ దంపతులు మాట్లాడిని మాటలు అందరిని భావోద్వేగానికి గురి చేశాయి. ఇది ఇలా ఉంటే.. ఈ పెళ్లి అనంతరం ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.

పెళ్లికి దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. అంటే వివాహానికి అంబానీ విపరీతంగా ఖర్చు చేశారు. అయినా కూడా ఆయన సంపంద ఏమాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం ఏమో కానీ.. ఆయన సంపద భారీగా పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్‌తక్ తెలిపిన వివరాల ప్రకారం… పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్‌ రూ.25 వేల కోట్లు పెరిగింది. అదే విధంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్‌వర్త్‌ 118 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. అదే అనంత్ అంబానీ పెళ్లి జరిగిన రోజు జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇలా ఒక్కసారిగా అసాధారణ రీతిలో అంబానీ సంపద పెరిగింది. తాజాగా పెరిగిన సంపదతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్నిపెరిగింది.

ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి మెరుగుపడ్డారు.  ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్‌ అంబానీ  కొనసాగుతున్న సంగతి తెలిసింది. అంబానీ నెట్‌వర్త్‌ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని కొందరు మార్కెట్ నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1 శాతం పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65 శాతం పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90 శాతం రాబడిని అందుకున్నారు. ఈ భారీ లాభాలు కొత్త కోడలు తెచ్చిన అదృష్టంగా పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి