Jhelum River: Video: నదిలో కొట్టుకుపోతున్నబాలుడు.. ప్రాణాలకు తెగించి రక్షించిన యువకుడు!

Video: నదిలో కొట్టుకుపోతున్నబాలుడు.. ప్రాణాలకు తెగించి రక్షించిన యువకుడు!

Jhelum River: తమ ప్రాణాలకు అపాయం జరగనంత వరకే ఎదుటి వారిని రక్షించేందుకు వస్తారు. అయితే మరికొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి..మరి.. ఎదుటి వారిని రక్షిస్తుంటారు. అలానే ఓయువకుడు చేసి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Jhelum River: తమ ప్రాణాలకు అపాయం జరగనంత వరకే ఎదుటి వారిని రక్షించేందుకు వస్తారు. అయితే మరికొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి..మరి.. ఎదుటి వారిని రక్షిస్తుంటారు. అలానే ఓయువకుడు చేసి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు.

ప్రాణం అనేది ఎంతో విలువైనది. ఎవరైన ప్రమాదంలో ఉంటే కాపాడేందుకు  చాలా మంది ముందుకు వస్తారు. కానీ తమ ప్రాణాలకు అపాయం జరగనంత వరకే ఎదుటి వారిని రక్షించేందుకు వస్తారు. అయితే మరికొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి..మరి.. ఎదుటి వారిని రక్షిస్తుంటారు. అలాంటి ఘటన జమ్ముకశ్మీర్ లో చోటుచేసుకుంది.  ఓ మైనర్ బాలుడు నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు.. అందరూ చూస్తున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రాణాలను ఫణంగా పెట్టి..నదిలోకి దూకి ఆ బాలుడిని రక్షించాడు. మరోయువకుడు సీపీఆర్ చేసి.. శ్వాస అందేలా చేశాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్త వివరాల్లోకి వెళ్తే..

కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ప్రాంతంలోని గాసీ మొహల్లా సఫాకాదల్ 7 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారికి  సమీపంలో జీలం నది ఉంది. ఇక ఎండల వేడికి తట్టుకోలేక.. ఆ బాలుడు సేద తీరేందుకు నది వద్దకు వెళ్లాడు. అందులోకి దిగి కాసేపు కూల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో జీలం నది ప్రవాహ ఉద్ధృతి  ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆ బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడు. ప్రమాదంలో ఉన్న బాలుడిని గమనించిన జహూర్ అహ్మద్, షౌకత్ అహ్మద్ అనే స్థానిక యువకులు వెంటేనే స్పందించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్నా, తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన కూడా నదిలోకి  దూకి బాలుడ్ని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుడికి సీపీఆర్  చేసి మరో ప్రాణాలు కాపాడారు.

ఇక ఈ ఘటన గురించి బాలుడిని రక్షించిన వారిలో ఒకరైనా జహూర్ అహ్మద్ ఈ ఘటన కొన్ని విషయాలను తెలిపారు. నదిలో కొట్టుకుపోతున్న బాలుడ్ని ఒడ్డుకు చేర్చిన సమయంలో చనిపోయాడని తాము అనుకున్నట్లు అతడు తెలిపారు. కానీ కాసేపు సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడని, ఆలస్యం చేయకుండా చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆ యువకుడు తెలిపాడు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక, బాలుడ్ని రక్షిస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.  ఆ ఇద్దరి యువకులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments