iDreamPost
android-app
ios-app

మైనర్ బాలికతో స్కూల్లో అడ్డంగా బుక్కైన ఉపాధ్యాయుడు!

  • Published Jul 12, 2024 | 5:02 PM Updated Updated Jul 12, 2024 | 5:02 PM

గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఓ గొప్ప శ్లోకం ఉంది. గురువు గొప్పతనం గురించి చెబుతుంది. కానీ నేటి కాలంలో గురువులు కీచకులుగా మారారు.

గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఓ గొప్ప శ్లోకం ఉంది. గురువు గొప్పతనం గురించి చెబుతుంది. కానీ నేటి కాలంలో గురువులు కీచకులుగా మారారు.

  • Published Jul 12, 2024 | 5:02 PMUpdated Jul 12, 2024 | 5:02 PM
మైనర్ బాలికతో స్కూల్లో అడ్డంగా బుక్కైన ఉపాధ్యాయుడు!

‘మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ’ అంటుంటారు పెద్దలు. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువులదే. విద్యా బుద్దులు నేర్పి.. విద్యార్థులకు మంచి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. తప్పుటగులు వేస్తున్న పిల్లలను సరైన దారిలో పెట్టి.. వారిని మార్గ నిర్దేశకం చేసేది పంతులే. కానీ నేటి కాలంలో విద్య కమర్షియలు అయిపోయి.. తూతూ మంత్రపు చదువులు వచ్చేశాయి. నాలుగు గోడల మధ్య, రెండు పేజీల్లో విద్యార్థి జీవితం నలిగిపోతుంది. ఇక ఆడపిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. చదువు, ఇల్లు తప్ప మరో లోకం తెలియదు. దీంతో ఉపాధ్యాయుల చేతుల్లో పెడుతుంటారు కొంత మంది తల్లిదండ్రులు. ఇదే క్రమంలో ఉపాధ్యాయుల ముసుగులో కీచకులు తయారయ్యారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆమెను మార్కులు, చదువులు పేరు చెప్పి లొంగదీసుకుంటున్నారు.

తాజాగా బీహార్‌లోని మోతీహరి జిల్లా ఘోరసహన్ బ్లాక్‌లో ఆందోళన కలిగించే సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులకు విషయం తెలిసి చితకబాదారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..  ఆత్మమోహన్‌కు చెందిన రాకేష్ కుమార్ అనే టీచర్.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎనిమిదో తరగతి బాలికను ట్యూషన్ పేరుతో ఓ చోటుకు రప్పించుకుని.. ఆమెతో అసభ్యంగా తాకాడు. తొలుత సారే కదా అని భావించారు. కానీ తలుపులు గడియపెట్టుకుని ఉండే సరికి వెళ్లి చూడగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం అతడ్ని చావబాదారు. ఊరు ఊరంతా అతడిపై దాడి చేసిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం.. అదనపు తరగతులున్నాయని.. ఘోరసహన్ వెలుపల ఉన్నఓ రూంకి తీసుకెళ్లి 8వ తరగతి బాలికను తీసుకెళ్లాడు ఉపాధ్యాయుడు. తొలుత క్లాసులు చెబుతున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. అయితే గ్రామస్థులకు అనుమానం కలిగి.. వెళ్లి చూడగా.. ఆమెను అనుచితంగా తాకుతూ కనిపించాడు.  ఇక అంతే పొట్టుపొట్టున తన్ని.. పోలీసులకు అప్పగించారు.  ఘోరసహన్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.  ఇంతలో, మైనర్ విద్యార్థి కుటుంబం ఈ సంఘటనపై దిగ్భ్రాంతిని వేదనను మిగిల్చింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి డిమాండ్ చేశారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet