కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలుంటే బ్యాంకు ఖాతాలో రూ.2లక్షలు!

Congress: దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష నేతలు తమదైన స్టైల్లో ప్రచారాల్లో దూసుకువెళ్తున్నారు. ప్రచారాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Congress: దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష నేతలు తమదైన స్టైల్లో ప్రచారాల్లో దూసుకువెళ్తున్నారు. ప్రచారాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవడం కోసం కొన్ని పార్టీలు ఇష్టానుసారంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓట్లు పడితే చాలు.. తర్వాత చూసుకుందాం అన్నట్లుగా ఉంది ఆ పార్టీ నేతల వ్యవహారం. కొంతమంది సీనియర్ నేతలు ప్రచారాల్లో ఇస్తున్న హామీలు చూసి ఓటర్లు నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాత్లం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎన్నికల వేల పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ఎం చేస్తామన్న విషయానికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఓటర్లకు కనీ వినీ ఎరుగని రీతిలో హామీల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజల మెప్పు పొందేందుకు నానా తిప్పలు పడుతున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత ఇద్దరు భార్యలు ఉంటే వారి ఖాతాలో ఏడాదికి రెండు లక్షలు వేస్తామని ప్రకటించారు. ఏది పడితే అది మాట్లాడటం.. హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా మారుతుందని సదరు నేత నిరూపించాడు. సదరు నేత సామాన్యులేం కాదు.. ఐదు సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కాంతిలాల్ భూరియా.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాత్లం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కాంతి లాల్ భురియా సైలానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మ పథకం గురించి ప్రస్తావన తెచ్చారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాలు వేస్తామని మేనిఫెస్టోలో పెట్టామని.. ఒకవేళ ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటే రెండు లక్షలు వస్తాయని’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా, కాంతి లాల్ భురియా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Show comments