India Vs Pakistan Military .. భారత్ బలమెంత? పాక్ పవరెంత?

India Vs Pakistan Military: ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాలు కూడా శత్రువులు అని అందరికీ తెలుసు. పాకిస్థాన్ మనపై ఎప్పుడూ పగతో రగిలిపోతూ ఉంటుంది.

India Vs Pakistan Military: ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాలు కూడా శత్రువులు అని అందరికీ తెలుసు. పాకిస్థాన్ మనపై ఎప్పుడూ పగతో రగిలిపోతూ ఉంటుంది.

భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. పాకిస్థాన్ కేవలం మన భారతదేశం నుంచి విరిగిపోయిన ముక్క మాత్రమే. కానీ అనుక్షణం మన దేశంపై పగతో రగిలిపోతూ ఉంటుంది. మనపై అన్నీ విధాలుగా ఆధిపత్యం చాలయించాలని, మనల్ని ఓడించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. భారత్‌పై దాడి చేస్తూ ఉంటుంది. మన దేశాన్ని ఏమి చేయలేక నిత్యం మనపై మాటల యుద్ధం కూడా చేస్తూ ఉంటుంది పాకిస్థాన్. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అయితే ఈమధ్య యుద్ధాలు పెద్దగా జరగలేదు కానీ.. గతంలో భారత్, పాక్ మధ్య చాలా యుద్ధాలే జరిగాయి. కానీ ఆ యుద్ధాల్లో మనదే పైచేయిగా నిలిచింది. అయితే భారత్ కి పాకిస్థాన్ కి మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి మరోసారి యుద్ధం వస్తే.. మన భారత్ బలం ఎంత? పాకిస్థాన్ పవర్ ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా ట్రాన్స్పోర్ట్ విమానాలు అంటే రవాణా విమానాల విషయానికి వస్తే.. పాకిస్థాన్ కి కేవలం 60 విమానాలు మాత్రమే ఉన్నాయి. కానీ మన భారత దేశానికి ఎన్ని ఉన్నాయో తెలుసా ఏకంగా 264 విమానాలు ఉన్నాయి. యుద్ధ విమానాల విషయానికి వస్తే.. మనకు ఏకంగా 606 విమానాలు ఉండగా.. పాకిస్థాన్ మిలీటరీకి మాత్రం కేవలం 387 మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన విమానాలు.. ఈ విమానాలు కలిపి మనకు మొత్తం 2296 ఉండగా.. పాకిస్థాన్ కి 1434 విమానాలు ఉన్నాయి. అయితే యుద్ధ హెలికాప్టర్ల విషయానికి వస్తే.. మన కంటే పాకిస్థాన్ ఆర్మీకే ఎక్కువ ఉన్నాయి. పాకిస్థాన్ కి 57 హెలికాప్టర్లు ఉండగా.. మనకు కేవలం 40 మాత్రమే ఉన్నాయి. ఇక నార్మల్ హెలికాప్టర్లు అయితే మనకు 869 ఉన్నాయి. పాకిస్థాన్ కి మాత్రం 352 ఉన్నాయి. మనకు రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ ఉన్నాయి. కానీ పాకిస్థాన్ కి మాత్రం ఒక్కటి కూడా లేదు. సబ్ మెరైన్స్ పాకిస్థాన్ కి 8 ఉండగా మనకు మొత్తం 18 ఉన్నాయి.

ఇక నావి ఫ్లీట్స్ అంటే నావి షిప్స్ విషయానికి వస్తే.. మనకు 294 ఉండగా.. పాకిస్థాన్ కు 114 ఉన్నాయి. ఇక మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ మనకు 702 ఉండగా.. పాకిస్థాన్ కి 602 ఉన్నాయి. ఇక గన్ తో కాల్చే వెహికల్స్ అంటే బుల్డోజర్లు మనకు 3243 ఉండగా పాకిస్థాన్ కు 3238 ఉన్నాయి. ఇక మనకు యుద్ధ ట్యాంకర్లు మొత్తం 4614 ఉండగా, పాకిస్థాన్ కి 3742 ఉన్నాయి. ఇక బాలిస్టిక్ మిసయిల్స్ పాకిస్థాన్ కి 90 ఉండగా మనకు కేవలం 66 మాత్రమే ఉన్నాయి. న్యూక్లియర్ బాంబ్స్ పాకిస్థాన్ కి 170 ఉంటే మనకు 172 ఉన్నాయి. ఇక రిజర్వ్ ఫోర్స్ సైనికులు మనకు 1,155,000 మందికి పైగా ఉంటే పాకిస్థాన్ కి మాత్రం కేవలం 550,000 మంది మాత్రమే ఉన్నారు. ఇక యాక్టివ్ ఫోర్సెస్ సైనికులు మన వద్ద ఏకంగా 1,455,550 మంది ఉండగా.. పాకిస్థాన్ వద్ద 6,54,000 మంది ఉన్నారు. దీన్ని బట్టి పాకిస్థాన్ కంటే మన ఇండియన్ ఆర్మీకే ఎక్కువ పవర్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments