మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే!

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3 న అభ్యర్థుల జాతకాలు వెలువడనున్నాయి. ఇంతలోనే కేంద్రం సామాన్యులపై ఓ భారం మోపింది.

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3 న అభ్యర్థుల జాతకాలు వెలువడనున్నాయి. ఇంతలోనే కేంద్రం సామాన్యులపై ఓ భారం మోపింది.

దేశంలో నిన్నటితో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.. డిసెంబర్ 3న ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రధాన పార్టీల విషయంలో ఇక ఎగ్జిట్ పోల్స్ రక రకాలుగా రిపోర్టులు అందిస్తున్నాయి. అలా ఎన్నికలు ముగిశాయో లేదు.. కేంద్రం అప్పుడు షాక్ ఇవ్వడం మొదలు పెట్టింది. సామాన్యుల మీద భారం మొదలైంది.. కమర్షియల్ గ్యాస్ సిలండర్ పై ధరలను పెంచేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాక ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో అని సామన్యులకు ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఎక్కడెక్కడ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయో చూద్దాం.

సామాన్యులకు మరోసారి ద్రవ్యోల్బణ ప్రభావం పడింది. డిసెంబర్ 1 వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధరల రేట్లు పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50 కి చేరింది. నవబర్ 16న ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1775.50 వద్ద కొనసాగింది. ప్రస్తుతం రూ.21 మేర పెరిగింది. కోల్‌కొతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1908 కి పెరిగింది. ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1968 రేటు కొనసాగుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై ధరలు పెరగడంతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరంలో రూ.2045 గా పలుకుతుంది. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల రేట్లు మాత్రమే పెరిగాయి.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రస్తుతానికి స్థిరంగానే కొనసాగుతున్నాయి. డొమెస్టిక్ అంటే.. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు. ఇది 14.2 కేజీల వరకు మాత్రమే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మూడు సార్లు ధరలు పెరిగాయి. అక్టోబర్, నవంబర్ తర్వాత డిసెంబర్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర  పెంచడం గమనార్హం. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.903 వద్ద కొనసాగుతుంది. ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజలపై భారం అప్పుడే మొదలైంది.. భవిష్యత్ లో డొమెస్టిక్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ గ్యాస్ ధరల విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments