Uttar Pradesh: VIDEO: క్యాంపస్‌లో గ్యాస్ లీక్.. పరుగులు పెట్టిన నర్సింగ్ విద్యార్థినులు

VIDEO: క్యాంపస్‌లో గ్యాస్ లీక్.. పరుగులు పెట్టిన నర్సింగ్ విద్యార్థినులు

ఓ క్యాంపస్‌లో శుక్రవారం హఠాత్తుగా గ్యాస్ లీక్ అయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న క్యాంపస్ నుంచి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

ఓ క్యాంపస్‌లో శుక్రవారం హఠాత్తుగా గ్యాస్ లీక్ అయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న క్యాంపస్ నుంచి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) కార్యాలయ క్యాంపస్‌లో శుక్రవారం విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఉన్నట్టుండి అందులో ఉన్న క్లోరిన్ గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది. దీంతో ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థులు షాక్ గురయ్యారు. ఇక మొత్తానికి గ్యాస్ లీక్ అయిందన్న విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు క్యాంపస్ నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటనతో కొందరు విద్యార్థినులు కొద్దిసేపు ఊపిరాడక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంతే కాకుండా ఎక్కడి వారు అక్కడే పడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ధైర్యాన్ని చెప్పారు. ఇక ఆ తర్వాత తక్షణ వైద్యం కోసం ఆ నర్సింగ్ విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనతో అక్కడి విద్యార్థులు, అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని అంతా పరిశీలించారు. ఆ తర్వాత క్లోరిన్ గ్యాస్ లీక్ కు గల కారణం ఏంటనే పూర్తి వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమయంలో మరి కొందరు విద్యార్థులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్.. నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, ఇకనైన అధికారులు స్పందించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Show comments