iDreamPost
android-app
ios-app

Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జనవరి 31 వరకు లాస్ట్ డేట్.. లేకపోతే అంతే

  • Published Dec 31, 2023 | 11:16 AM Updated Updated Dec 31, 2023 | 11:16 AM

బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

  • Published Dec 31, 2023 | 11:16 AMUpdated Dec 31, 2023 | 11:16 AM
Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జనవరి 31 వరకు లాస్ట్ డేట్.. లేకపోతే అంతే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే.. కచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. ఇక రాష్ట్రాల్లో వీటి ద్వారా కేవలం సరుకులు మాత్రమే కాక.. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందాలన్న రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ రేషన్ అందిస్తుండగా.. ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బోగస్ రేషన్ కార్డులను ఏరి వేయడం కోసం వెరిఫికేషన్ చేపడుతోంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా.. లక్షల్లో బోగస్ రేషన్ కార్డులన్నట్లు గురించి కేంద్ర ప్రభుత్వం.. వాటి ఏరివేతకు శ్రీకారం చుట్టింది. దీనికోసం రేషన్ కార్డులను ఆధార్ నంబర్‌తో లింక్ (ఈ కేవైసీ) చేయాలని చెబుతోంది. రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు మార్లు గడువు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ గడవును వచ్చే ఏడాది అనగా జనవరి 31, 2024 వరకు పొడగించింది.

alerts for ration card holders

కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌.. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారు జనవరి 31 లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ తో లింక్ చేయాలని  శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, ఐరీష్(కంటిపాప) గుర్తింపును వంటి వివరాలను తీసుకుంటున్నారు. ఇప్పటికి కూడా రేషన్ కార్డను ఆధార్ తో లింక్ చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి దాన్ని రద్దు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వ డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలిగిపోతాయి. దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోతాయి. రేషన్ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ కేవైసీని పూర్తి చేశారు.  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 30 నాటికి ఈ ప్రక్రియ 70.80 శాతం ఈ కేవీసీ పూర్తయిందని అధికారులు తెలిపారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio