iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డు దారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి!

కేంద్ర ప్రభుత్వం తరచూ ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూనేఉంటుంది. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారికి వివిధ స్కీమ్స్ ద్వారా శుభవార్తను చెబుతుంది. తాజాగా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటంటే...

కేంద్ర ప్రభుత్వం తరచూ ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూనేఉంటుంది. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారికి వివిధ స్కీమ్స్ ద్వారా శుభవార్తను చెబుతుంది. తాజాగా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటంటే...

రేషన్ కార్డు దారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి!

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలకు వివిధ స్కీమ్స్ కింద ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. అలానే తరచూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుంటుంది. తాజాగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్తను కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరి.. కేంద్రం చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కరోనా మహమ్మారి సమయంలో తీసుకొచ్చిన ఉచిత రేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్‌ను ప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలో పీఎంజీకేఓవై పథకాన్ని ఏప్రిల్ 2020లో కేంద్రం ప్రారంభించింది. మొదట మూడు నెలలు మాత్రమే ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు ఈ స్కీమ్ తెచ్చారు.  ఈ స్కీమ్ కింద నెలకు రేషన్ కార్డులోని ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందించింది.

ఆ తర్వాత పలు మార్లు ఈ స్కీమ్ ను కేంద్రం పొడిగించింది. తాజాగా ఈ స్కీమ్ ను మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన  సమావేశంలో కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని నవంబర్ 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక విషయాలను వెల్లడించారు. ఉచిత రేషన్ పథకమైన గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ మరో 5 ఏళ్లు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ పొడిగింపు నిర్ణయం 2024 జనవరి 1 నుంచి వర్తిస్తుందన్నారు. ఆ విధంగా ఐదేళ్ల పాటు అంటే డిసెంబర్, 2028 వరకు పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనుందని మంత్రి తెలిపారు. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని  పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీ ఉచిత రేషన్ స్కీమ్ ను మరో ఐదేళ్లు పొడిగిస్తామని ప్రకటించారు. ఆయన చెప్పిన తరువాత ఈ రోజు కేంద్ర కేబినెట్ ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం 2023  డిసెంబర్ తో గడువు ముగియనుంది. ఇప్పుడు కేంద్రం 5 ఏళ్ల పాటు పొడిగింపు నిర్ణయం తీసుకోవడంతో 2028 డిసెంబర్ వరకు ఈ పథకం ప్రయోజనాలను కొనసాగిస్తారు. మరి.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis