New Delhi: కేంద్రం కీలక నిర్ణయం.. ఆరేళ్లు నిండితేనే ఫస్ట్‌ క్లాస్‌లోకి

బడికి వెళ్లే పిల్లలకు .. ఆరు సంవత్సరాలు పూర్తయితే కానీ, 1వ తరగతిలో చేరేందుకు అర్హులని.. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బడికి వెళ్లే పిల్లలకు .. ఆరు సంవత్సరాలు పూర్తయితే కానీ, 1వ తరగతిలో చేరేందుకు అర్హులని.. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒకప్పుడు పిల్లలను స్కూల్ లో జాయిన్ చేయాలంటే కనీసం ఐదు నుంచి ఆరేళ్ళు వచ్చే వరకు.. వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని మారి పోయాయి. మారుతున్న జెనెరేషన్ ని బట్టి ఇప్పుడు ఉండే పిల్లలు కూడా .. ఈ ఫాస్ట్ జనరేషన్ లో ముందుడాలని.. తల్లి తండ్రులు తమ పిల్లలను మూడు నుంచి నాలుగేళ్లకే స్కూల్స్ లో జాయిన్ చేసేస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు.. పోటీ పడుతూ ఉన్నారు. ఇక కొన్ని స్కూల్స్ లో పెట్టే ఒత్తిడికి దెబ్బతింటున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అయితే, వీటన్నిటిని నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. దానికి సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి.

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ) 2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009 కింద .. ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు కనీస వయస్సు ఆరు సంవత్సరాలు ఉండాలనే రూల్ ను తీసుకుని వచ్చింది. కాగా, 3 నుంచి 8 సంవత్సరాల వయసు మధ్యలో పిల్లలకు.. 3 ఏళ్ల ప్రి స్కూల్‌, 1,2వ తరగతులు పూర్తయినట్లైతే.. పిల్లలకు నేర్చుకునేందుకు మంచి అవకాశాలుంటాయనే నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వీటిని ఉద్దేశించి.. ఇటీవల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. వాటితో పాటు నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీలో పేర్కొన్న కొన్ని విషయాలను కూడా కేంద్రం గుర్తు చేసింది. పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చించే వయసు పలు రాష్ట్రాల్లో పలు రకాలుగా ఉందని.. గతంలో లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం తెలిపింది. ఇక ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం పిల్లలను 1వ తరగతిలో చేర్పించాలంటే .. వారి కనీస వయస్సు ఆరు సంవత్సరాలై ఉండాలి.

ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ లో పిల్లలను త్వర త్వరగా స్కూల్స్ లో జాయిన్ చేయాలని.. అందరు పేరెంట్స్ అనుకుంటారు. కానీ, ఎదుగుతున్న ప్రక్రియలో కొన్ని స్కూల్స్ లో పెట్టే ఒత్తిడిని తట్టుకునే శక్తి అందరికి ఉండదు. అది పిల్లల మానసిక ఎదుగుదలను ఖచ్చితంగా దెబ్బ తీస్తుంది. ఓ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే. ఇక ఈ కొత్త నిబంధనలు కూడా తక్షణమే అమలు అవుతాయని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరి, 1వ తరగతి చదవాలంటే వారి కనీస వయస్సు ఆరు సంవత్సరాలు ఉండాలనే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments