ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 13 రకాల అలవెన్సులు 25 శాతానికి పెంపు..

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు అందించే 13 రకాల అలవెన్సులను 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు భారీగా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు అందించే 13 రకాల అలవెన్సులను 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు భారీగా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50 శాతానికి పెరిగింది. దీంతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా డియర్నెస్ రిలీఫ్ ని కూడా 4 శాతానికి పెంచడంతో అది 50 శాతానికి పెరిగింది. ఈ డీఏ, డీఆర్ లు ఈ ఏడాది జనవరి 1 నుంచే కేంద్రం అమలులోకి  తెచ్చింది. డీఏ, డీఆర్ లు 50 శాతానికి పెరగడంతో పాటు ఉద్యోగులకు అందించే 13 రకాల కొన్ని అలవెన్సులు, ప్రయోజనాలు వంటివి పెరగాలని.. 25 శాతం మేర పెరగాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ మేరకు జూలై 4న సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం ఓ సర్క్యులర్ ని జారీ చేసింది.

గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జారీ చేసిన ఉత్తర్వులపై దృష్టి సారించామని.. డియర్నెస్ అలవెన్స్ 4 శాతం పెరగడంతో 50 శాతానికి చేరుకుందని సర్క్యులర్ లో పేర్కొంది. 2024 జనవరి 1 నుంచి ఇది అమలులోకి వచ్చిందని.. దాని ప్రకారం అలవెన్సులు చెల్లింపులు ప్రస్తుతం ఉన్న ధరల కంటే కూడా 25 శాతం పెంచిన రేట్లలో చెల్లించవచ్చునని.. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం సర్క్యులర్ లో పేర్కొంది. అయితే డీఏ 50 శాతానికి చేరిన సందర్భంగా 25 శాతం పెరగనున్న అలవెన్సులలో రవాణా భత్యం (కన్వేయన్స్ అలవెన్స్), వికలాంగ మహిళలకు ప్రత్యేక భత్యం (స్పెషల్ అలవెన్స్ ఫర్ డిజేబుల్డ్ విమెన్), పిల్లల విద్యా భత్యం (చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్), హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా మొత్తం 13 రకాల అలవెన్స్ లు ఉన్నాయి.

వికలాంగ మహిళా ఉద్యోగులకు చిన్నపిల్లలు, వికలాంగ పిల్లలు ఉంటే వారికి అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం స్పెషల్ అలవెన్సుని అందిస్తుంది. ఇందులో భాగంగా నెలకు 3 వేల వరకూ ప్రత్యేక అలవెన్సుని చెల్లిస్తుంది కేంద్రం. పిల్లలకు రెండేళ్ల వయసు వచ్చేవరకూ ఈ ప్రత్యేక అలవెన్సుని చెల్లిస్తారు. ఈ అలవెన్సు ఇప్పుడు 25 శాతం పెరగనుంది. దీంతో వికలాంగ మహిళా ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. అలానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇద్దరు పిల్లలకు హాస్టల్ ఫీజు మీద సబ్సిడీ అందిస్తుంది కేంద్రం. నెలకు 6,750 రూపాయల వరకూ చెల్లిస్తుంది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే గనుక ఉన్న దానికి రెండింతలు ఉంటుంది. నెలకు రూ. 4500 వరకూ ఉంటుంది. అయితే ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇప్పుడు 25 శాతానికి పెరిగింది. అలానే ఉద్యోగులకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్సు కూడా 25 శాతానికి పెరగనుంది. దీంతో పాటు ఫుడ్ ఛార్జీలు, సొంత కారు లేదా ట్యాక్సీ ఉంటే వాటికయ్యే ఖర్చులు, సిటీ లోపల రవాణా ఛార్జీలు, డైలీ అలవెన్సులు, హాస్టల్ అకామడేషన్, డ్రెస్ అలవెన్సులు, డిప్యుటేషన్ డ్యూటీ అలవెన్సులు, స్ప్లిట్ డ్యూటీ అలవెన్సులు వంటివి కూడా 25 శాతానికి పెరగనున్నాయి.     

Show comments