iDreamPost
android-app
ios-app

OTT ప్యాకేజ్ భారీగా తగ్గింపు.. కేవలం రూ.49లకే..

  • Published Apr 30, 2024 | 4:57 PM Updated Updated Apr 30, 2024 | 4:57 PM

BSNL: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక అదిపోయే ఫ్లాన్స్ ను తన వినియోగాదరులకు ఇస్తుంది. తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

BSNL: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక అదిపోయే ఫ్లాన్స్ ను తన వినియోగాదరులకు ఇస్తుంది. తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

  • Published Apr 30, 2024 | 4:57 PMUpdated Apr 30, 2024 | 4:57 PM
OTT ప్యాకేజ్ భారీగా తగ్గింపు.. కేవలం రూ.49లకే..

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా బాగా నడుస్తోంది. ఈ ప్లాట్ ఫామ్ పై సినిమాలు చూసే వారికి సంఖ్య బాగా పెరిగి పోయింది. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు వస్తూ ప్రేకక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. ఇక సినిమా థియేటర్లో చూసిన సినిమాలు అయినా సరే, ఓటీటీలో మళ్లీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఓటీటీలో అనేక వెబ్ సిరీస్ లు వస్తుంటాయి. ఇక ఓటీటీకీ సంబంధించి అనేక ప్లాన్ లను టెలికాం సంస్థలు అందిస్తుంటాయి. తాజాగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కి సంబంధించి బీఎస్ఎన్ఎల్  గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక అదిపోయే ఫ్లాన్స్ ను తన వినియోగాదరులకు ఇస్తుంది. అలానే ఎప్పటికప్పుడు ఆకర్షించే ప్లాన్ అందిస్తూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటుంది. ముఖ్యంగా డేటా, ఫోన్ కాల్స్ కి సంబంధించి బీఎస్ఎన్ఎల్ ఎన్నో ఆఫర్లను ప్రకటించిస్తుంది. వీటిలో చాలా వరకు కాలింగ్, డేటాకు సంబంధించిన ప్లాన్స్ ఎక్కువగా ఉన్నాయి. తాజాగా తమ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ఓ శుభవార్త చెప్పింది.  గతంలో స్టార్టర్ ప్యాక్ కింద రూ.99 వసూలు చేసింది. దానిని మారుస్తు కీలక నిర్ణయం తీసుకుంది.

బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఉపయోగిస్తున్న వినియోదార్ల కోసం అనేక ప్లాన్లను అందిస్తుంది. అలానే వారిని ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది బీఎస్ఎన్ఎల్. గతంలో స్టార్టర్ ప్యాక్ కింద రూ.99 వసూలు చేసింది. దానిని మారుస్తు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిని రూ.49 తగ్గించింది. ఈప్లాన్ లో లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీలను సబ్ స్క్రిప్షన్  చేసుకుని వాటిల్లోనే కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ స్టార్టర్‌ ప్యాక్‌ ను రూ.49కే అందిస్తూనే.. తాజాగా మరో రెండు ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. కేవలం 199 రూపాయలకే జీ5, సోనీలివ్‌, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఓటీటీ  ఫుల్‌ ప్యాక్ ప్యాకేజీని అందిస్తోంది.

దీనితో పాటు మరో ప్లాన్ కూడా బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. రూ.249 ప్రీమియం ప్లాన్ ను కూడా కస్టమర్లకు అందిస్తోంది. రూ.249తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీమియం ప్లాన్‌లో జీ5, సోనీ లివ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, యప్‌టీవీ, లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలు ఉంటాయి. ఈ ప్లాన్ ను తీసుకుంటే పై ఓటీటీల్లోని కంటెంటెను ఎంజాయ్‌ చేయొచ్చు. వివిధ రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ అనేది సినిమా ప్లస్ సబ్ స్క్రిప్షన్ తో లభిస్తోంది. ఒక్క లాగిన్ తో ఇవన్నీ లభిస్తాయి. మొత్తంగా బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులకు పై ప్లాన్లు అందిస్తోంది. మరి.. బీఎస్ఎస్ఎన్ అందిస్తున్న ఈ ప్లాన్ పై మీ అభిప్రాయాలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom