P Venkatesh
Brother Marries sister: డబ్బు కోసం అన్నా చెల్లి చేయరాని పని చేశారు. కేవలం 35 వేల కోసం ఏకంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ వారు ఎందుకు అలా చేశారంటే?
Brother Marries sister: డబ్బు కోసం అన్నా చెల్లి చేయరాని పని చేశారు. కేవలం 35 వేల కోసం ఏకంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ వారు ఎందుకు అలా చేశారంటే?
P Venkatesh
అన్నా, చెల్లెలి బంధం అపురూపమైనది. అన్నా, చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం. కలిసి అల్లరి చేస్తారు. ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. ఒకరి భావాలను ఒకరు పంచుకుంటారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తారు. వారిలో ఒకరికి ఆపద వస్తే మరొకరు కన్నీరు కారుస్తారు.. అండగా నిలుస్తారు. అన్నా, చెల్లెలి బంధం తర్వాతే ఏ బంధమైనా అన్నట్లుగా వ్యవహరిస్తారు. అంత పవిత్రమైనది అన్నా చెల్లెలి బంధం. కానీ, అక్కడ ఓ అన్నా చెల్లి మాత్రం సమాజం తలదించుకునేలా వ్యవహరించింది. కేవలం 35 వేల కోసం అన్నా, చెల్లి చేయకూడని పని చేశారు. డబ్బు కోసం ఆ అన్నా, చెల్లెలిద్దరు పెళ్లి చేసుకున్నారు. కాపురం చేసేందుకో, కలిసి బ్రతికేందుకో మాత్రం కాదు కేవలం డబ్బుకోసం కక్కుర్తిపడి ఈ పనికి పూనుకున్నారు.
ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు అన్నా చెల్లి ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇది నమ్మడానికి అవకాశం లేకున్నా నమ్మి తీరాల్సిందే. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు అనేది ఈ ఘటనతో బట్టబయలైంది. అన్నా, చెల్లి పెళ్లి చేసుకున్న విషయం తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. డబ్బు కోసం మరీ ఇంతకు దిగజారిపోతారా అంటూ మండిపడుతున్నారు. డబ్బు జీవితంలో చాలా అవసరం. డబ్బు సంపాదించేందుకు కొంత మంది అడ్డదార్లు తొక్కేందుకు కూడా వెనకాడరు. ఇతరులను మోసం చేసి డబ్బు కాజేస్తుంటారు. ఇదే రీతిలో కొత్తగా పెండ్లి చేసుకున్న జంటకు ప్రభుత్వం అందజేసే నగదు సాయాన్ని పొందేందుకు అక్రమ మార్గం తొక్కారు.
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో రూ.35 వేల కోసం అన్నాచెల్లెలు వివాహం చేసుకోవటం అందర్నీ షాక్‌కు గురిచేసింది. డబ్బులు వస్తాయన్న ఆశతో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. నిజం ఎప్పటికీ దాగదు కదా. తీరా ఈ విషయం బయటికి పొక్కింది. దీంతో వారి అసలు బండారం బయటపడింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇలా దొంగ పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక.. స్థానిక మున్సిపల్ ఉద్యోగి హస్తం ఉందని గుర్తించారు. వారికి నకిలీ వివాహ ధ్రువీకరణ పత్రాలను సమకూర్చినట్లు తేల్చారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్రట్ర వేద్ సింగ్ చౌహాన్.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాలని చూసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.
కాగా యూపీలో యోగి సర్కార్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెళ్లి చేసుకుంటే ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న యువతికి రూ.35 వేల నగదు, రూ.10వేల విలువైన నిత్యావసర వస్తువులు, పెళ్లి ఖర్చుల కింద మరో రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ సాయాన్ని పొందేందుకు అన్నా, చెల్లి పెళ్లి చేసుకుని ప్రభుత్వ సొమ్ముని కాజేయాలని చూశారు. చివరికి దొరికిపోయారు. ఇప్పటి వరకు ఇలా దొంగ పెళ్లిల్లు చేసుకున్న జంటలు చాలానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లుగా అధికారులు వెల్లడించారు. మరి డబ్బు కోసం అన్నా, చెల్లి పెళ్లి చేసుకున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.