iDreamPost
android-app
ios-app

ప్రియుడ్ని మోసం చేసి మరొకరితో రొమాన్స్! కథలో మరో ట్విస్ట్!

  • Published Feb 21, 2024 | 1:07 PM Updated Updated Feb 21, 2024 | 1:07 PM

సమాజంలో ఇప్పుడు బేబిలు ఎక్కువయ్యారు. ఒకరితో ప్రేమ, మరొకరితో రొమాన్స్. ముక్కు మొహం తెలియని వాడితో పెళ్లి. ఈ ధోరణి ఇప్పుడు ఎక్కువగా మారిపోయింది. అయితే ప్రేమికురాలు మోసం చేస్తే.. ప్రియుడు ఊరుకుంటాడా..?

సమాజంలో ఇప్పుడు బేబిలు ఎక్కువయ్యారు. ఒకరితో ప్రేమ, మరొకరితో రొమాన్స్. ముక్కు మొహం తెలియని వాడితో పెళ్లి. ఈ ధోరణి ఇప్పుడు ఎక్కువగా మారిపోయింది. అయితే ప్రేమికురాలు మోసం చేస్తే.. ప్రియుడు ఊరుకుంటాడా..?

  • Published Feb 21, 2024 | 1:07 PMUpdated Feb 21, 2024 | 1:07 PM
ప్రియుడ్ని మోసం చేసి మరొకరితో రొమాన్స్! కథలో మరో ట్విస్ట్!

ప్రేమ వ్యవహారంలో ఎక్కువగా అబ్బాయిలే చీట్ చేస్తుంటారు.. అమ్మాయిలు మోసపోతుంటారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అమ్మాయిలు బేబీ(ఒకరిద్దరిని ప్రేమించడం)లుగా మారుతున్నారు.ఒకరితో ప్రేమ, మరొకరితో రొమాన్స్ చేస్తున్నారు. మొదటి లవర్ గురించి, మరో ప్రియుడికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎప్పుడు కర్మ బాగోక మరో అబ్బాయితో ప్రియుడి కంట కనిపించగానే.. అన్నయ్య అంటూ కవర్ చేసేస్తున్నారు. చక్కర్లు కొట్టేందుకు ఒకడు.. ఖర్చులకు మరొకర్ని అంటూ టైం పాస్ లవ్ చేస్తున్నారు. చివరకు వీరికి హ్యాండ్ ఇచ్చి.. వేరొకడితో మూడు ముళ్ల వేయించుకుంటున్నారు.

తాజాగా ప్రేమించి.. ఆమె కెరీర్ కోసం ఎంతో కష్టపడిన యువకుడికి హ్యాండ్ ఇచ్చింది ప్రియురాలు. అయినా సరే ఆమె కావాలంటూ.. ఎన్ని తప్పులు చేసినా క్షమించి..ప్రియురాల్ని మనువాడుతానని అంటున్నాడు ఈ గొప్ప ప్రేమికుడు. ఈ ఘటన కర్ణాటక రాయచూర్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మడికేరికిలోని సోమవారపేటకు చెందిన ఖుషీ అనే యువతి 2021లో ల్యాబ్ టెక్నీషియన్ శిక్షణ కోసం రాయచూర్ వచ్చింది. ఆ సమయంలో వికాస్ కుమార్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం బలపడి.. ప్రేమ చిగురించింది. మూడేళ్లుగా ఒకరిినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే ఖుషీని నర్సింగ్‌లో మరింత ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని మరొక ఆసుపత్రికి పంపాడు. ఇదే అతడు చేసిన పెద్ద తప్పు. అక్కడకు వెళ్లాక ఖుషీలో మెల్లిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రియురాలు మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసి అతడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. అయితే మరొకరితో ప్రియురాలు పెళ్లికి సిద్ధం అవుతుందని తెలిసి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేయసి మోసం చేసిందంటూ కంప్లంట్ ఇచ్చాడు. ‘ ఖుషీ నాకు మొదటగా ప్రపోజ్ చేసింది. మా కులాలు వేరైనప్పటికీ.. ఆమె ప్రేమను అంగీకరించాను. మూడేళ్ల పాటు ప్రేమించుకున్నాం. డిసెంబర్ 26 వరకు అంతా సజావుగా సాగిపోయింది. అయితే నర్సింగ్ ప్రాక్టీసు కోసం బెంగళూరుకు పంపాను. ఆమెపై రూ. 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను’ అని మీడియాలో చెప్పాడు వికాస్

‘ఇప్పుడు అక్కడకు వెళ్లాక.. మరో అబ్బాయితో ప్రేమలో పడింది. అతడి గురించి అడిగితే.. ఫ్రెండ్ అని చెప్పింది. మొన్న పార్క్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. నా గుండె ముక్కలైంది. రాత్రి వచ్చి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్దమైంది. అయినా సరే ఆమె నాకు కావాలి. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. మోసం చేసినప్పటికీ.. ఆమె తిరిగి వస్తే ఆమెను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను’ అని చెప్పాడు ఈ ట్రూలవర్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom