P Krishna
Teacher Inappropriate Behaviour: ఓ టీచర్ పాఠశాల సమయంలో మహిళా ప్రిన్సిపల్ ముందు బహిరంగంగా మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Teacher Inappropriate Behaviour: ఓ టీచర్ పాఠశాల సమయంలో మహిళా ప్రిన్సిపల్ ముందు బహిరంగంగా మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
P Krishna
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చి, పది మందిలో గౌరవంగా ఉండేలా చేసేది గురువు. మనిషి ప్రతి క్షణంలోనూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు.. దానికి గురువు ఎంతో అవసరం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువులను సాక్షాత్తు భగవంతుడితో పోల్చుతుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది గురువు స్థానానికి మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం.. మద్యం సేవించి విద్యాసంస్థలకు రావడం, విద్యార్థులపై దాడి చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ టీచర్ స్కూల్ టైమ్ లో మహిళా ప్రిన్సిపల్ ముందే.. మద్యం దాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్‌లో ఓ టీచర్ మద్యం సేవిస్తున్న వీడియో వెలుగు లోకి వచ్చింది. పాఠశాల సమయంలో మహిళా ప్రిన్సిపల్ ముందు బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించాడు. స్కూల్లో అది కూడా ఓ మహిళా ప్రిన్సిపల్ ముందు మద్యం సేవిస్తుంటే మరో ఉపాధ్యాయుడు ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అతని మాట లెక్కచేయకుండా పైగా అతన్ని దూషిస్తూ చేబులో నుంచి బాటిల్ తీశాడు. టేబుల్ పై ప్లాస్టిక్ గ్లాస్ లో మద్యం పోసుకొని మంచినీళ్లు కలుపుకొని మద్యం సేవించాడు. తోటి ఉపాధ్యాయుడికి మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలనుకుంటే వారికి చేసుకోండి, నేను ఎవరికీ భయపడను అని కూడా చెప్పాడు. ఈ ఘటన బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి బ్లాక్ ఏరియాలోని మచాహా ప్రైమరీ స్కూల్ లో చోటు చేసుకుంది.
బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి బ్లాక్ ఏరియాలోని మచాహా ప్రైమరీ స్కూల్‌లొ బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మహిళా ప్రధానోపాధ్యాయురాలి ముందు సంతోష్ కుమార్ కేవత్ అనే టీచర్ మద్యం సేవించాడు. ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడు ఇది తప్పు అని చెప్పాడు. నేను ప్రతిరోజూ తాగుతాను. ఏదో సమస్య? నాకు అన్నీ ఉన్నాయి. నువు తాగుతావా? అని అడిగాడు సంతోష్ కుమార్. పాఠశాల ప్రారంభ సమయం ఉదయం 7:30 నుండి 11:30 వరకు. కానీ సంతోష్ కుమార్ మాత్రం 10.30కి టీచర్ వచ్చీ రావడమే ఈ పని చేయడం వివాదం అయ్యింది. ఈ ఘటన గురించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తులసీ చౌహాన్ మాట్లాడుతూ.. స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్ చేసిన ఈ చర్య హేయమైనది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవో టీఆర్ సాహుకు సమాచారం అందించాం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పై అధికారలుు హామీ ఇచ్చారు. సదరు టీచర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.