Arjun Suravaram
కర్నాటక రాజధాని బెంగళురూ నగరంలో అనేక ప్రాంతాల వారు నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు రాకపోకలు సాగుతుంటాయి. ఇక్కడ కెంపెగౌడ అంతర్జాతీయ విమాశ్రయం ఉంది. తాాజాగా ఇక్కడ మరో ఎయిర్ పోర్టు రానుంది.
కర్నాటక రాజధాని బెంగళురూ నగరంలో అనేక ప్రాంతాల వారు నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు రాకపోకలు సాగుతుంటాయి. ఇక్కడ కెంపెగౌడ అంతర్జాతీయ విమాశ్రయం ఉంది. తాాజాగా ఇక్కడ మరో ఎయిర్ పోర్టు రానుంది.
Arjun Suravaram
దేశంలోని అతి ముఖ్యమైన నగరాల్లో బెంగళూరు ఒకటి. గ్రీన్ సిటీగా పేరుతో పాటు ఐటీ ఐబ్ గా ఈ నగరానికి చాలా ప్రత్యేకత ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఉంది. ఇక్కడి నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అంతేకాక ఇక్కడ రద్దీ బాగా పెరిగి పోయింది. ఈ నేపథ్యంలోనే కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఎయిర్ పోర్టును నిర్మించేందుకు సిద్ధమవుతుంది. మరి.. దీనికి సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే…
కర్నాటక రాజధాని బెంగళురూ నగరంలో అనేక ప్రాంతాల వారు నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు రాకపోకలు సాగుతుంటాయి. ఇక్కడ కెంపెగౌడ అంతర్జాతీయ విమాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీస్ లు ఉన్నాయి. అయితే పెరుగుతున్న జనాభా, ప్రయాణికులతో ఈ విమానాశ్రయం రద్దీగా మారుతుంది. ఈ క్రమంలోనే మరో విమానాశ్రయం కోసం కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ వేస్తుంది. బెంగళూరులో రెండో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమి కోసం సిద్దరామయ్య సర్కర్ అన్వేషణ ప్రారంభించింది.
ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఆధ్వర్యంలో జూన్ 20న సమావేశం జరిగింది. రెండో విమానాశ్రయానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక సోషల్ మీడియా వేదికగా మంత్రి కీల విషయాలను వెల్లడించారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు మెట్రోపాలిస్ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి రెండవ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి తాను అధికారులతో ప్రాథమిక చర్చను నిర్వహించానని మంత్రి పాటిల్ తెలిపారు.
శుక్రవారం విధానసౌధలో జరిగిన ఈ సమావేశంలో ఐడీడీ కార్యదర్శి ఎన్ మంజుల, కర్ణాటక ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ సతీష్, తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ, ముంబై తర్వాత భారతదేశంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. గత సంవత్సరం 37.5 మిలియన్ల ప్రయాణికులను, 4 లక్షల టన్నులకు పైగా కార్గోను నిర్వహించింది. ఇది ఒక ఆవశ్యకతను హైలైట్ చేస్తుంది. భవిష్యత్ వృద్ధికి అనుగుణంగా రెండవ విమానాశ్రయం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
Bengaluru’s Growth Takes Flight: New Airport Plans on the Horizon
I held a preliminary discussion with officials regarding the construction of a second airport to address the future needs of our rapidly growing global metropolis. This significant meeting, held in the Vidhana… pic.twitter.com/ZdsoL9Lxfv
— M B Patil (@MBPatil) June 20, 2024