iDreamPost
android-app
ios-app

ఆటో వెనకాల అద్భుతమైన లవ్‌ కొటేషన్‌.. చదివితే మతిపోతుంది!

  • Published Oct 02, 2023 | 6:04 PM Updated Updated Oct 02, 2023 | 6:04 PM
  • Published Oct 02, 2023 | 6:04 PMUpdated Oct 02, 2023 | 6:04 PM
ఆటో వెనకాల అద్భుతమైన లవ్‌ కొటేషన్‌.. చదివితే మతిపోతుంది!

ప్రేమ.. ఓ స్థిరమైన అర్థం లేనిది.. ఎప్పటికీ అర్థం కానిది. ప్రేమ కారణంగా ఒక్కో మనిషికి ఒక్కోలాంటి అనుభవం ఎదురవుతుంటుంది. ప్రేమ కారణంగా బాధలు పడ్డవారు.. చేదు అనుభవాలు పొందిన వారు.. దానిపై నెగిటివ్‌ అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. ప్రేమ కారణంగా బాధల కంటే సంతోషాలు ఎక్కువ పొందిన వారు ఆ అనుభవాలతో ప్రేమకు మించింది ఏదీ లేదు అనుకుంటూ ఉంటారు. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే.. ప్రేమ కారణంగా కష్టాలు వచ్చినా.. కన్నీళ్లు కన్నీళ్లు రాలినా.. నిత్యం నరకం అనుభవిస్తూ ఉన్నా ఒకే భావంతో ఉంటారు.

మురిపించే అందమైన జ్ఞాపకాలతో.. కన్నీళ్లు పెట్టించే చేదు అనుభవాలతో జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో ఆటో వెనకాల లవ్‌ కొటేషన్స్‌ బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా లవ్‌లో ఫెయిల్‌ అయిన  ఆటో డ్రైవర్లు ఆటో వెనకాల కొటేషన్స్‌ రాసి పెట్టుకుంటున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ తాలూకా కొటేషన్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ లవ్‌ కొటేషన్‌ చదువుతున్న నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

ఇంతకీ ఆ కొటేషన్‌ ఏంటంటే.. ‘‘ ప్రేమ పార్కులో నడకలాంటిది.. జురాసిక్‌ పార్క్‌’’ అని రాసుకొచ్చాడు. సమర్న్‌ అలర్న్‌కర్‌ అనే వ్యక్తి దీన్ని ఫొటో తీసి తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ‘‘బెంగళూరు ఆటో డ్రైవర్లు వారి ఫిలాసఫీలు’ అని రాసుకొచ్చాడు. ఆ పోస్ట్‌ కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కొటేషన్‌పై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ప్రేమ గురించి ఏమైనా సందేహాలు, సూచనలు కావాలంటే ఆటో డైవర్లను అడగండి’’.. ‘‘ ప్రతీ ఆటో డ్రైవర్‌ జీవితంలో ఓ లవ్‌ ఫెయిల్‌ ఉంటుంది.. లేదా లవ్‌ ఫెయిల్‌ అయిన వాళ్లే ఆటో నడుపుతూ ఉంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, బెంగళూరు ఆటో డ్రైవర్‌ లవ్‌ కొటేషన్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş