iDreamPost
android-app
ios-app

Karnataka: సినిమా స్టైల్లో ట్విస్టులు.. కారు‌లో పెళ్లి.. అంతలోనే..

  • Published Jan 04, 2024 | 1:04 PM Updated Updated Jan 04, 2024 | 3:43 PM

ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు.. అది సినిమా స్టైల్లో.. కానీ ఆ పెళ్లి కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి.

ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు.. అది సినిమా స్టైల్లో.. కానీ ఆ పెళ్లి కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి.

  • Published Jan 04, 2024 | 1:04 PMUpdated Jan 04, 2024 | 3:43 PM
Karnataka: సినిమా స్టైల్లో ట్విస్టులు.. కారు‌లో పెళ్లి.. అంతలోనే..

ఇటీవల యువత పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటను కొంతమంది తల్లిదండ్రులు ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటున్నారు. చాలా వరకు ప్రేమ జంట కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు.. సమాజంలో కులాలకు పెద్దపీట వేసేవాళ్లకు ఇది మింగుడు పడకపోవడం.. కొన్నిసార్లు పరువు హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేస్తున్న కుర్రాళ్లు ఎక్కువ అవుతున్నారన్న భయంతో యువతి తల్లిదండ్రులు ప్రేమ వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు.. అది కూడా కారులో.. తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి.. చివరికి ఠాణాకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే..

బళ్లారి జిల్లాకు సిరుగుప్ప తాలూకాకు చెందిన శివ ప్రసాద్ డిప్లోమా చేశాడు. కోప్పళ జిల్లాలో డిగ్రీ చేస్తున్న అమృతను కొంతకాలం క్రితం కలిశాడు శివప్రసాద్. వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు కన్నడ మూవీ కిరాతక సినిమా స్టైల్లో కారు వెను సీట్లో కూర్చొని దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో కాస్త యువతి తల్లిదండ్రుల కంట పడింది. అప్పటికే తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీస్ స్టేషన్ కి వచ్చారు శివప్రసాద్, అమృత. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి పంచాయతీ నిర్వహించారు. యువతి అభిప్రాయం మేరకు భర్త వద్దకు పంపించాలని తీర్పు ఇచ్చారు. దీంతో చేసేది ఏమీ లేక అమృత తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

ఇక్కడే ఒక ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటివరకు పంచాయతీ పెద్దలు, పోలీసులు, తల్లిదండ్రుల ముందు అమృత తనకు శివ ప్రసాద్ కావాలంటూ చెప్పినప్పటికీ.. ప్లేట్ ఫిరాయించి తనకు తల్లిదండ్రులే కావాలంటూ మెలిక పెట్టింది. దీంతో పోలీసులకు కొత్త తలనొప్పి మొదలైంది. రాత్రి కావడంతో పోలీస్ స్టేషన్ లో ఉంచుకోవడం మంచిది కాదని లేడీ పోలీసుల సహకారంతో కంటోన్మెంట్ లోని స్త్రీ సేవా నికేతన్ సాంత్వన కేంద్రానికి తరలించారు. అయితే ఆ సమయంలో శివ ప్రసాద్ వాహనం ముందు కూర్చొని అమృతను తాను పెళ్లి చేసుకున్నానని.. దండలు మార్చుకోవడమే కాదు మెడలో నల్లపూసల దండ కూడా వేసినట్లు తెలిపాడు.  పోలీసులు కౌన్సిలింగ్ చేసిన తర్వాత అమృత మళ్లీ మనసు మార్చుకొని శివ ప్రసాద్ తో ఇంటికి వెళ్తానని చెప్పడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ సందర్భంగా పోలీసులు అమృత అటు ప్రియుడు, ఇటు తల్లిదండ్రులను కాదనలేక మనసు గందరగోళానికి గురైందని.. ఆమెకు సర్ది చెప్పడంతో సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నుంచి వీడియో రికార్డు చేసి అమృతను శివప్రసాద్ వెంట పంపించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet