iDreamPost
android-app
ios-app

అల్లోపతి మందులు విషపూరితమైనవి.. లక్షల మంది చనిపోయారు: బాబా రామ్ దేవ్

  • Published Aug 18, 2024 | 7:20 AM Updated Updated Aug 18, 2024 | 7:20 AM

Those Medicines Killed Millions Of People In India Said Baba Ramdev: మనం వాడుతున్న మందులు విషంతో సమానమని.. ఆ మందుల వల్ల లక్షల మంది చనిపోయారని పతంజలి కంపెనీ సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ ఆరోపించారు.

Those Medicines Killed Millions Of People In India Said Baba Ramdev: మనం వాడుతున్న మందులు విషంతో సమానమని.. ఆ మందుల వల్ల లక్షల మంది చనిపోయారని పతంజలి కంపెనీ సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ ఆరోపించారు.

అల్లోపతి మందులు విషపూరితమైనవి.. లక్షల మంది చనిపోయారు: బాబా రామ్ దేవ్

ఏ చిన్న జబ్బు వచ్చినా మందులు వాడడం అనేది ఒక అలవాటు అయిపోయింది. మెడికల్ షాప్ కి వెళ్లడం.. మందులు తెచ్చుకుని వేసుకోవడం.. మరీ సీరియస్ అయితే డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు రాయించుకోవడం చేస్తున్నాం. అయితే ఈ మందుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పలు దగ్గు సిరప్ ల వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు వచ్చాయి కూడా. అయితే ఈ మందుల వల్ల లక్షల్లో ప్రాణాలు పోతున్నాయని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కంపెనీ కో ఫౌండర్, యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆరోపించారు. మరోసారి బాబా రామ్ దేవ్ అల్లోపతి మందులకు వ్యతిరేక కామెంట్స్ చేశారు. హరిద్వార్ లోని పతంజలి యోగ్ పీఠ్ లో మీడియా సమావేశంలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.

సింథటిక్ డ్రగ్స్ వల్ల దేశంలో లక్షల మంది మరణిస్తున్నారని బాబా రామ్ దేవ్ విమర్శలు గుప్పించారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు హానికరమైన ఔషధాలను తయారు చేస్తున్నాయని.. వాటిపైనే ఆధారపడేలా చేసున్నాయని ఆరోపించారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు సింథటిక్ డ్రగ్స్ మీద ఆధారపడుతున్నాయని.. అల్లోపతి మందుల వల్ల భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారని అన్నారు. ప్రజలకు తెలియకుండా ఆ విషపూరిత మందులకు అలవాటు పడేలా విదేశీ కంపెనీలు చేస్తున్నాయని.. వాటి మీద ఆధారపడేలా చేస్తున్నాయని విమర్శించారు. స్వదేశీ, సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని.. పతంజలి స్వదేశీ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.

ఆయుర్వేద మందులను వాడకంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గతంలో పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు పతంజలి కంపెనీ మీద ఫిర్యాదు నమోదైంది. కోవిడ్ 19 సమయంలో లక్షల మంది మరణాలకు అల్లోపతి మందులే కారణమని, కరోనా వైరస్ ని నయం చేసేది పతంజలి కరోనీల్ అని బాబా రామ్ దేవ్ మరియు అతని అసోసియేట్ ఆచార్య బాలకృష్ణ ప్రకటన చేశారు. రామ్ దేవ్ మీద, అతని అసోసియేట్ ఆచార్య బాలకృష్ణ మీద డాక్టర్స్ అసోసియేషన్ వారు దావా వేశారు.

కరోనీల్ అనేది కోవిడ్ 19 వైరస్ ని నివారిస్తుందని వాళ్ళు చేసిన వాదనలు నిరాధారమైనవని దావాలో తెలిపారు. ఈ మందు కేవలం ఇమ్యునో బూస్టర్ గా మాత్రమే లైసెన్స్ పొందిందని దావా ఆరోపించింది. రామ్ దేవ్ సహా ఇంకెవరూ భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయకుండా నిరోధించాలని డాక్టర్స్ తరపు సీనియర్ న్యాయవాది కోర్టుని అభ్యర్థించారు. ఈ కేసుని విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న పతంజలి ప్రకటనలను వెనక్కి ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాబా రామ్ దేవ్ కోర్టుకి క్షమాపణలు చెప్పారు.