ప్రాణ ప్రతిష్ట వేళ.. అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్!

చారిత్రాత్మక రామ్ మందిర్ ప్రారంభమవుతున్న వేళ అయోధ్యలో ఉగ్ర వాదులు కలకలం సృష్టిస్తున్నారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్‌ పోలీస్‌ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది.

చారిత్రాత్మక రామ్ మందిర్ ప్రారంభమవుతున్న వేళ అయోధ్యలో ఉగ్ర వాదులు కలకలం సృష్టిస్తున్నారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్‌ పోలీస్‌ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది.

దేశమంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శీరాముని జన్మస్థలమైన అయోధ్యా పురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరనున్న వేళ దేశమంతా రామనామంతో మారుమ్రోగుతోంది. ఈ నెల 22న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగనున్నాయి. అయోధ్యలో కొలువుదీరనున్న కోదండ రాముని దర్శనం కోసం రామ భక్తులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా చారిత్రాత్మకమైన రామ్ మందిర్ ప్రారంభమవుతున్న వేళ అయోధ్యలో ఉగ్ర వాదులు కలకలం సృష్టిస్తున్నారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్‌ పోలీస్‌ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది.

అయోధ్యలో ప్రారంభమవబోతున్న రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఆలయ ట్రస్ట్ వారు ఇప్పటికే దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఈ వేడుకకు వేల సంఖ్యలో అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అయోధ్యా నగరాన్ని అణువణువునా జల్లెడ పడుతున్నారు పోలీసులు.

ఈ క్రమంలో భద్రత కోసం చేపట్టిన తనిఖీల్లో భాగంగా ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల్ని యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్వాడ్‌ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలపై ఈ ముగ్గురిని విచారిస్తున్నట్లు యూపీ స్పెషల్‌ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ ప్రకటించారు. అయితే అరెస్టు చేసిన అనుమానిత ఉగ్రవాదుల వివరాల్ని గానీ.. విచారణకు సంబంధించిన విషయాలపైగానీ ఇంకా ప్రకటన వెలువడలేదు. కాగా అయోధ్యలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట వేళ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు తీవ్ర కలకలం రేపింది.

Show comments