iDreamPost
android-app
ios-app

డ్రైవర్ కి రూ.45 కోట్ల లాటరీ! ఇది మామూలు లక్ కాదు!

  • Published Jan 03, 2024 | 4:23 PM Updated Updated Jan 03, 2024 | 4:23 PM

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో అనేది ఎవ్వరూ ఊహించలేం. ఒక బిచ్చగాడిని సైతం రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యేలా చేస్తోంది. అలాంటి అదృష్ట దేవత తలుపు తట్టి ఒక సాధారణ డ్రైవర్ ని కూడా కోటీశ్వరుడిని చేసింది. ఇంతకి ఎంత అంటే..

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో అనేది ఎవ్వరూ ఊహించలేం. ఒక బిచ్చగాడిని సైతం రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యేలా చేస్తోంది. అలాంటి అదృష్ట దేవత తలుపు తట్టి ఒక సాధారణ డ్రైవర్ ని కూడా కోటీశ్వరుడిని చేసింది. ఇంతకి ఎంత అంటే..

  • Published Jan 03, 2024 | 4:23 PMUpdated Jan 03, 2024 | 4:23 PM
డ్రైవర్ కి రూ.45 కోట్ల లాటరీ! ఇది మామూలు లక్ కాదు!

అదృష్టం.. ఇది ఎప్పుడు ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. ఒక బిచ్చగాడిని సైతం రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యేలా చేస్తోంది. చాలామంది తమ జీవితాల్లో అదృష్టం అనేది రాసి పెట్టలేదేమో అని నిందించుకుంటూ నిరుత్సాహ పడతారు. అలాంటి సమయంలో ఎవరికైనా అదృష్ట దేవత తలుపు తడితే అప్పుడు వారికి ఆశ్చర్యంతో పాటు పట్టరాని సంతోషం కూడా కలుగుతుంది. ఒక్కోసారి వారికి కలిగిన అదృష్టాన్ని వారే నమ్మలేని స్థితిలో ఉంటారు. నిజంగా ఇది కల లేదా భ్రమ అనే ఊహలో ఉంటారు. అయితే అలాంటి లక్కీ ఛాన్స్ కోసం కొందరు ఎంత ప్రయత్నించినా అదృష్టం అనేది కలిసిరాదు. మరికొందరు, ఏదో ఒక రాయి వేసి చూద్దాం.. అన్నట్లుగా ప్రయత్నించగానే ఊహించని విధంగా అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడే , దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని అనిపిస్తూంది. అచ్చం ఇలానే ఓ వ్యక్తి జీవితంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. లాటరీ టికెట్ రూపంలో అదృష్టం ఓ డ్రైవర్ జీవితాన్నే మార్చేసింది ఏకాంగా జాక్ పాట్ నే కొట్టాడు. అదే ఎంత అంటే..

సాధారణంగా ఎవరికైనా లాటరీ తగలితే చాలు.. అబ్బ ఏం అదృష్టం.. నక్క తోక తొక్కావు లే అంటారు. అచ్చం అలానే యూఏఈలో డ్రైవర్ గా పని చేస్తున్ మునావర్ ఫైరూస్ అనే భారతీయ యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ఇక ఆ లక్కీ డ్రాలో రూ. 45 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కాగా, మునావర్ ఎప్పటికైనా అదృష్టం తనని వరిస్తుందనే ఉద్దేశంతో.. గత ఐదేండ్లుగా ప్రతి నెలా లాటరీ టికెట్లు కొనేవాడు. ఇక ఆ అదృష్టం న్యూ ఇయర్ రోజు తలుపు తట్టింది. డిసెంబర్ 31న నిర్వహించిన బిగ్ టికెట్ లైవ్ డ్రాలో మెగా ప్రైజ్ మనీ విజేతగా మునావర్ నిలిచాడు. ఈ లక్కీ డ్రాలో అతడికి ఏకాంగా 20 మిలియన్ల దిర్హామ్ అనగా అక్షరాల రూ.45,32,02,295 గెలుచుకున్నాడు.

ఇక ఒక్క రాత్రిలో అతను కోటీశ్వరుడు కావడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. కోట్ల రూపాయలు కలిగిన జాక్ పాట్ లో విజేతగా నిలిచానంటే తనకే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదని ఆ వ్యక్తి తెలిపాడు. అలాగే రూ.45 కోట్లు గెలుచుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఈ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసేందుకు తనకు 30 మంది స్నేహితులు సహకరించారు. కనుక వారితో కలిసి ఈ ఫ్రైజ్ మనీని పంచుకుంటాను అని మునావర్ పేర్కొన్నాడు. మరి, కోట్ల రూపాయల జాక్ పాట్ తగిలిన ఓ డ్రైవర్ నేడు కోటిశ్వరుడు కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet