iDreamPost
android-app
ios-app

సంగీత కచేరీలో డ్యాన్స్‌తో అదరగొట్టిన అంబానీ కుటుంబం.. వీడియో వైరల్

  • Published Jul 07, 2024 | 5:00 AM Updated Updated Jul 07, 2024 | 5:00 AM

Ambani Family Dance: ఈ నెల 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక జరగనుంది. ఈ క్రమంలో వాహ వేడుకకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Ambani Family Dance: ఈ నెల 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక జరగనుంది. ఈ క్రమంలో వాహ వేడుకకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

  • Published Jul 07, 2024 | 5:00 AMUpdated Jul 07, 2024 | 5:00 AM
సంగీత కచేరీలో డ్యాన్స్‌తో అదరగొట్టిన అంబానీ కుటుంబం.. వీడియో వైరల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. జూలై 5న ముంబైలో సంగీత కచేరీని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ లో అంబానీ కుటుంబం బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ఓం శాంతి ఓం సినిమాలోని మోస్ట్ పాపులర్ సాంగ్ అయిన దీవాంగి దీవాంగి పాటకు ముఖేష్ అంబానీ కుటుంబం మొత్తం కలిసి డ్యాన్స్ చేశారు. ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ అంతా కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసి సందడి చేశారు. వీరి డ్యాన్స్ అతిథులనే కాకుండా నెటిజన్స్ ని సైతం ఆకట్టుకుంది. కాగా ఈ ఈవెంట్ లో అంబానీ కుటుంబం లెహంగాలు, షేర్వానీ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. నీతా అంబానీ పింక్ కలర్ లెహంగాలో సందడి చేయగా.. ముఖేష్ అంబానీ నేవీ బ్లూ కలర్ కుర్తా పైజామా, జాకెట్ లో సందడి చేశారు. జాగా ఈ డ్యాన్స్ కి సంబందించిన డ్యాన్స్ వీడియోను వైరల్ భయానీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

వీడియోలో పాట ప్రారంభంలో ఆకాష్ అంబానీ, ఆనంద్ పిరమల్ వేదికపై కనిపించగా.. ఆ తర్వాత ఇషా అంబానీ, శ్లోకా మెహతా, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఎంట్రీ ఇచ్చారు. ఆఖరున అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు స్టేజ్ పైన డ్యాన్స్ చేశారు. ఇలా వరుసగా అంబానీ కుటుంబం వేదికపై ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇలా అంతా కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేయడం ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీరి కుటుంబం యొక్క ఐకమత్యానికి ప్రతీక అంటూ కొనియాడుతున్నారు. కాగా ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ కి చెందిన సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనె, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, అలియా భట్, రణబీర్ కపూర్ వంటి సెలబ్రిటీలు.. అలానే ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, వంటి క్రికెటర్లు హాజరయ్యారు. అనంత్, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం అయిన యాంటీలియాలో జరగనుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom