iDreamPost
android-app
ios-app

రూ. 2 వేల కోట్ల కుంభకోణంలో ప్రముఖ సినీ నటి అరెస్ట్!

  • Published Sep 12, 2024 | 3:48 PM Updated Updated Sep 12, 2024 | 3:48 PM

Actor Sumi Bora: ఇటీవలే అస్సాం రాష్ట్రంలో ఓ స్కామ్ సంచలన సృష్టించిన సంగతి తెలిసింది. గుహహాటిలో రూ.2 వేల కోట్ల విలువైన స్టాక్ ట్రేడింగ్ స్కామ్ ను పోలీసులు బట్టబయలు చేశారు. తాజాగా ఈ స్కామ్ లో ప్రముఖ నటిని అరెస్టు చేశారు.

Actor Sumi Bora: ఇటీవలే అస్సాం రాష్ట్రంలో ఓ స్కామ్ సంచలన సృష్టించిన సంగతి తెలిసింది. గుహహాటిలో రూ.2 వేల కోట్ల విలువైన స్టాక్ ట్రేడింగ్ స్కామ్ ను పోలీసులు బట్టబయలు చేశారు. తాజాగా ఈ స్కామ్ లో ప్రముఖ నటిని అరెస్టు చేశారు.

  • Published Sep 12, 2024 | 3:48 PMUpdated Sep 12, 2024 | 3:48 PM
రూ. 2 వేల కోట్ల కుంభకోణంలో ప్రముఖ సినీ నటి అరెస్ట్!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో  వివిధ రకాల స్కామ లు బయటపడుతుంటాయి. కొందరు పలు మార్గాల్లో మోసాలకు పాల్పడుతూ వేల కోట్లను దోచుకుంటారు. అలా అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్న వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఇదే సమయంలో తరచూ వెలుగులోకి వచ్చే స్కామ్ లో కొందరు సినీ రంగానికి చెందిన వారి పాత్రలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కేసుల్లో పలువురు సెలబ్రిటీలు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.2 వేల కోట్ల స్కామ్ లో ఓ ప్రముఖ సినీ నటి కూడా అరెస్టు అయ్యారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవలే అస్సాం రాష్ట్రంలో ఓ స్కామ్ సంచలన సృష్టించిన సంగతి తెలిసింది. గుహహాటిలో రూ.2 వేల కోట్ల విలువైన స్టాక్ ట్రేడింగ్ స్కామ్ ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ స్కామ్ ఆస్సాం రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్టాక్ ట్రేడింగ్ ద్వారా కొందరు వేల కోట్లను అక్రమ మార్గంలో సంపాదించారు. ఇక ఈ స్కామ్ లో విశాల్ ఫుకాన్ అనే  బిజినెస్ మెన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాక ఆయనను విచారించగా ఈ స్కామ్ కి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక అస్సాం కి చెందిన ప్రముఖ సినీ నటి  సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరా కూడా ఈ స్కామ్ లో ఉన్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. దీంతో  వారిద్దరిని కూడా విచారణకి హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే  వారి నోటీసులను ఆ దంపతులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వారిద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11 బుధవారం సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అరెస్టు చేశారు. ఇదే విషయాన్ని పోలీసులే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే  స్టాక్ ట్రేడింగ్ స్కామ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.

నటి సుమి బోరా సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె సుపరిచతం. రాఘవ్ అనే హిందీ చిత్రం ద్వారా సుమి బోరా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ తరువాత పలు సినిమా కూడా నటించి మెప్పించింది. నటిగానే కాకుండా పలు చిత్రాలకి కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసింది. మొత్తంగా స్కామ్ లో ఇరుక్కున్న నటీమణుల జాబితాలో ఈమె కూడా చేరారు. గతంలో వివిధ స్కామ్స్ లో పలువురు సెలబ్రీటీలు అరెస్టు కావడం, మరికొందరు ఏకంగా జైలుకు వెళ్లడం కూడా జరిగింది. మరి..ఈమె విషయంలో అరెస్టు జరిగింది. జైలు వెళ్తారా లేదా అనేది భవిష్యత్ లో తెలియనుంది.

ఇక సినీ నటి అరెస్టైన నేపథ్యంలో ఈ స్టాక్ ట్రేడింగ్ స్కామ్  అంటే ఏమిటనే ప్రశ్నలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అస్సాం కి చెందిన విశాల్ ఫుకాన్‌  అనే వ్యాపారి తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో రెట్టింపు చేస్తానని చాలా మందిని నమ్మించాడు. అలా అతడు ఇతరుల దగ్గర దాదాపుగా వేలకోట్ల రూపాయలు వసూలు చేసాడు. తీరా లాభాలు చూపించే విషయంలో అవకతవకలు జరిగినట్లు ఇన్వెస్టర్లు గుర్తించారు. దీంతో తాము మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. ఈ స్కామ్ వ్యవహారం బయటపడింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom