iDreamPost
android-app
ios-app

ముంబై హోటల్లో 500 మంది కాలేజీ అమ్మాయిలకు భయానక అనుభవం!

కాలేజీ ట్రిప్ అని ఎంతో సంతోషంగా బయలు దేరిన జమ్ముకాశ్మీర్ కు చెందిన 500 మంది అమ్మాయిలకు ముంబయి చేరుకున్నాక భయానక అనుభవం ఎదురైంది. ఎంతో సంతోషంగా అక్కడకు వెళ్లిన వారికి.. హోటల్లో ఓ రకమైన ఆందోళనకు గురయ్యారు.. ఇంతకు ఏమైందంటే..?

కాలేజీ ట్రిప్ అని ఎంతో సంతోషంగా బయలు దేరిన జమ్ముకాశ్మీర్ కు చెందిన 500 మంది అమ్మాయిలకు ముంబయి చేరుకున్నాక భయానక అనుభవం ఎదురైంది. ఎంతో సంతోషంగా అక్కడకు వెళ్లిన వారికి.. హోటల్లో ఓ రకమైన ఆందోళనకు గురయ్యారు.. ఇంతకు ఏమైందంటే..?

ముంబై హోటల్లో 500 మంది కాలేజీ అమ్మాయిలకు భయానక అనుభవం!

సాధారణంగా కళాశాలలో విద్యార్థులను కాలేజీ యాజమాన్యం అప్పుడప్పుడు ప్రాజెక్ట్ పేరిట ఇండస్ట్రియల్ టూర్స్ కు తీసుకెళ్తూ ఉంటారు. విద్యార్థులు కూడా తమ స్నేహితులతో కలిసి వెళ్లిన మధుర క్షణాలు జీవితాంతం గుర్తిండిపోవాలని భావిస్తారు. కానీ, తాజాగా ఇలా జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లిన 500 మంది కాలేజీ అమ్మాయిలకు మాత్రం వారు వెళ్లిన ట్రిప్ చేదు జ్ఞాపకంగా మారింది. కాలేజీ ట్రిప్‌లో భాగముగా ముంబైకు చేరుకున్న యువతులకు.. అక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యాయి. ఆ ఒక్క రాత్రి ముంబై హోటల్లో విశ్రమిద్దాం అనుకున్న వారికి అక్కడి పరిస్థితులు, వాతావరణం తీవ్ర భయబ్రాంతులకు గురిచేశాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

జమ్మూ కాశ్మీర్ కు చెందిన దాదాపు 800 అమ్మాయిలు.. కాలేజ్ ఆన్ వీల్స్‌గా పిలిచే జ్ఞానోదయ ఎక్స్‌ప్రెస్‌‌లో కాత్రా నుంచి నవంబర్ 19 న బయల్దేరారు. ఆ కాలేజీ అమ్మాయిలకు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో పర్యటించేలా చేస్తారు. దాని ద్వారా వారికీ రాష్ట్రాల గురించి అవగాహన కల్పిస్తారు. దీనిని ఒక ప్రాజెక్ట్ గా భావిస్తారు. ఆ పర్యటన నుంచి కొత్త విషయాలు నేర్పించడం అనేది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తోంది. IRCTC, జమ్మూ కాశ్మీర్ హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ వారు ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములుగా ఉంటారు. అయితే, ఈ యాత్రలో భాగంగా వారు బయల్దేరిన 5 రోజుల తర్వాత ముంబై‌కు చేరుకున్నారు అమ్మాయిలు.

అక్కడ బస చేయడానికి గోరే‌గావ్‌లోని రాయల్ పామ్ హోటల్లో దిగారు. ముంబైకు చేరుకునే ముందే వారు ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో హోటళ్లను చూసి వచ్చారు. కాబట్టి, ముంబై లోని ఆ హోటల్ వారికి సౌకర్యంగా అనిపించలేదు. ఆ హోటల్ రూమ్స్, బెడ్ షీట్స్ దుర్వాసన కలిగించే విధంగా ఉన్నాయి. దీంతో వారు మొబైల్స్‌లో హోటల్ రివ్యూస్‌ను చూశారు. ఈ క్రమంలో వారికీ కొన్ని షాకింగ్ రివ్యూస్ కనిపించాయి. ఆ హోటల్‌కు సెక్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని రివ్యూస్‌ లో కనిపించాయి. గతంలో అక్కడ ఓ హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్‌ బయటపడిన విషయం వారికి తెలిసింది. దానితో వారికి భయం మొదలైంది.

కాగా, ఆ అమ్మాయిలు భోజనం చేసే సమయానికి వారి భయాలు ఇంకాస్త రెట్టింపు అయ్యాయి. సరిగ్గా వారు భోజనానికి కూర్చున్న సమయంలో 25 నిమిషాల పాటు లైట్స్ ఆగిపోయాయి. అయితే అది పవర్ కట్ వల్ల కాదని, కొందరు కస్టమర్లు అసాంఘిక కార్యకలాపాలు సాగించడం కోసం ఇలా చేశారని.. వారు తెలుసుకుని ఆశ్చర్య పోయారు. దీనితో హోటల్ సిబ్బందికి వారికీ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ గొడవను రికార్డు చేస్తుండగా.. ఆ ఫోన్ లాక్కొని వీడియో డిలీట్ చేసేందుకు గ్యాలరీలోకి వెళ్లగానే అమ్మాయిల నగ్న చిత్రాలు ప్రత్యేక్షమయ్యాయి. వాటిని చూసిన తర్వాత ఆ హోటల్ రూమ్స్‌లో నిద్రపోడానికి సాహసించలేదు అమ్మాయిలు. దీనితో వారు ఆ రాత్రంతా బిక్కు బిక్కుమంటూ భయటే గడిపారు.

అనంతరం వారి పరిస్థితులను చెప్పేందుకు రాయల్ పామ్స్ హోటల్.. యజమానుల్లో ఒకరైన దిలావర్ నెన్సేకు ఫోన్లు చేశారు, మెసేజ్‌లు పెట్టారు. కానీ అటు నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. చివరికి ఇక IRCTC కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పట్ల IRCTC చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ కాంట్రాక్టర్‌తోపాటు అక్కడ ఉద్యోగులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గడిచిన ప్రతి నిమిషం వెన్నులో వణుకు పుట్టించిన ఆ పరిస్థితులను.. జమ్మూ కాశ్మీర్ కు చెందిన 500 మంది అమ్మాయిలు ఎదుర్కొన్నారు. మరి వారికి ఎదురైన అనుభవాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.