సంకెళ్లతో టీచర్‌గా నియామక పత్రాన్ని అందుకున్న నిందితుడు..

కొన్ని అనివార్య కారణాల కారణంగా జైలుకెళ్లిన ఓ ఖైదీ మంచిగా చదువుకుని.. ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించరు. అలా ఊహిస్తే అది స్టూడెంట్ నంబర్ 1 సినిమా అవుతుంది. మరీ నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉంటారా అంటే.. ఇదిగో..

కొన్ని అనివార్య కారణాల కారణంగా జైలుకెళ్లిన ఓ ఖైదీ మంచిగా చదువుకుని.. ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించరు. అలా ఊహిస్తే అది స్టూడెంట్ నంబర్ 1 సినిమా అవుతుంది. మరీ నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉంటారా అంటే.. ఇదిగో..

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ 1. పొరపాటున జైలుకు వెళ్లిన ఓ కుర్రాడు.. తండ్రి కోరిక మేరకు లా చదివి, తన నాన్న కేసునే వాదించి గెలుస్తాడు. ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందే అందరికీ తెలుసు. జైలులో ఉన్న యువకుడు, చదవడం, విజయం సాధించడం అనేది కొత్త కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులు మూవీకి బ్రహ్మరథం పట్టారు. మరి నిజ జీవితంలో సాధ్యమా అంటే.. చాలా మంది కాదనే చెబుతారు. అదీ సినిమా బాబూ అని అనుకొని ఉండొచ్చు. సినిమాలు కూడా నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంతకు ఈ స్టోరీ ఎందుకనుకుంటున్నారా..ఓ నిందితుడు..జైలు నుండి చదువుకుని టీచర్ ఉద్యోగం కొట్టాడు మరీ. వినడానికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ.. ఓ వ్యక్తి సాధించాడు.

తాజాగా బేడీలతోనే తన అపాయింట్ మెంట్ లెటర్‌ను కూడా అందుకున్నాడు. ఈ స్టూడెంట్ నంబర్ 1 ఎవరు.. ఎక్కడంటే.. బీహార్ వాసి. వివరాల్లోకి వెళితే.. నలంద జిల్లాకు చెందిన రాజ్ కిషోర్ చౌదరి అనే వ్యక్తిపై కొన్ని నెలల క్రితం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ నిమిత్తం రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు. అయితే కొన్ని నెలల క్రితం బీహార్ ప్రభుత్వం బీపీఎస్సీ పరీక్ష నిర్వహించగా.. జైలులో ఉండగానే పరీక్షకు హాజరయ్యాడు. ఇటీవల ఫలితాలు వెల్లడి కాగా, అతడు ఉత్తీర్ణుడయ్యాడు. తియూరి హైస్కూల్‌లో టీచర్‌గా అతడికి పోస్టింగ్ ఇచ్చింది. అయితే బీహార్ షరీఫ్ బిహేవియరల్ కోర్టు అతడి నియామక పరీక్షా ఫలితాలను పరిశీలించింది. కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు గా‌ను అనుమతించింది.

అతడికి నియామక పత్రాన్ని అందించమని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అతడికి సంకెళ్లు వేసి డీఈవో కార్యాలయానికి తీసుకెళ్లారు జైలు అధికారులు. అయితే ఓ నిందితుడికి టీచర్ ఉద్యోగం రావడంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని అవసరమైన పేపర్ వర్క్‌ను పూర్తి చేసి.. అపాయింట్‌మెంట్ లెటర్‌ను అతడికి అందించారు. అప్పుడు కూడా సంకెళ్లు తీయలేదు అధికారులు. అలాగే నియామక పత్రాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. అయితే అపాయింట్ మెంట్ అందుకున్నా అతడు విధుల్లో చేరడానికి వీల్లేదు. ఎందుకంటే జైలు నిబంధనల ప్రకారం.. బెయిల్ మంజూరైతే కానీ జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి.. తన ఉద్యోగాన్ని నిర్వర్తించలేరని ఉన్నతాధికారి వెల్లడించారు. బెయిల్ మంజూరయ్యాక డిపార్ట్ మెంట్ ప్రాసెస్ పూర్తి అయ్యాక నిందితుడైన రాజ్ విధుల్లో చేరవచ్చునని పేర్కొన్నారు.

Show comments