iDreamPost
android-app
ios-app

తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు చేయించిన కొడుకు.. ఎక్కడంటే?

  • Published Mar 22, 2024 | 11:12 AM Updated Updated Mar 22, 2024 | 11:12 AM

Slippers Made with Skin: అమ్మను మించిన దైవం లేదు.. దేవుడు తనకు బదులుగా ఈ భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. ఓ కొడుకు తన తల్లికి ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చాడు.

Slippers Made with Skin: అమ్మను మించిన దైవం లేదు.. దేవుడు తనకు బదులుగా ఈ భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. ఓ కొడుకు తన తల్లికి ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చాడు.

  • Published Mar 22, 2024 | 11:12 AMUpdated Mar 22, 2024 | 11:12 AM
తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు చేయించిన కొడుకు.. ఎక్కడంటే?

అమ్మ అంటే ఓ అనుబంధం.. ఓ అనురాగం. అమ్మను మించిన దైవం లేదంటారు. తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవుడు తనకు మారుగా భూమిపైకి అమ్మను పంపించారని పెద్దలు అంటారు. నవ మాసాలు మోసిన తల్లి తన బిడ్డను చూసుకొని ఆ బాధను మర్చిపోతుంది. తన బిడ్డకు ఏ కష్టం వచ్చినా తన కంట కన్నీళ్లు వస్తాయి. సమాజంలో తన పిల్లలు గొప్ప పొజీషన్ లో ఉండాలని కోరుకుంటుంది ప్రతి తల్లి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాకుతూ పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసే తల్లిదండ్రులు వృద్దాప్యంలో తమకు ఆసరాగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది పుత్ర రత్నాలు తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు తరలిస్తున్నారు. అలాంటి ఈ సమాజంలో తన తల్లి కోసం ఓ కొడుకు చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..

మధ్య ప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్ గా ఉండేవాడు. తన తల్లిద్వారా రామాయణం, ఆ బోధనలు విని తన రౌడీ జీవితానికి గుడ్ బై చెప్పాడు. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి ఎంతో ముగ్దుడయ్యాడు. ఈ లోకంలో తన తల్లికి కనీ వినీ ఎరుగని బహుమతి ఇవ్వాలని భావించాడు. అనుకున్నదే తడవు.. తన చర్మంతో తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమతిగా ఇచ్చాడు. కొంత కాలంగా రామాయణం క్రమం తప్పకుండా చదువుతూ వస్తున్నాడు రౌనక్. ఈ క్రమంలోనే రాముడి వినయ విధేయతలు, తల్లిదండ్రుల పట్ల ఉన్న ఆప్యాయత, గౌరవం ఆయనను ఎంతో ప్రభావితం చేసింది.

Son made slippers with his skin for his mother

ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు తన మనసులో మాట చెప్పాడు. రౌనత్ తీసుకున్న నిర్ణయం కఠినమే అయినా.. తల్లిపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పదిగా భావించి ఆయన శరీరం నుంచి కొంత చర్మాన్ని తొలగించారు. దాంతో రౌనత్ తన తల్లికి చెప్పులు తయారు చేయించాడు. మార్చి 14 నుంచి 21 వ తేదీ వరకు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి కృతజ్ఞతలు చాటుకున్నాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహరాజ్, అక్కడికి వచ్చన భక్తులు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తల్లి అక్కున చేర్చుకొని ఆనంద భాష్పాలు రాల్చింది. ఈ సందర్బంగా తల్లి నిరులా మాట్లాడుతూ.. ‘నా కొడుకును కన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఏ కొడుకు ఇంత గొప్ప త్యాగం చేయలేరు. తన చర్మాన్ని ఒలిచి నాకు చెప్పులు చేయించి తన ప్రేమను చాటుకున్నాడు. ఆ దేవుడు నా కొడుకుకి ఏ కష్టాలు రాకుండా చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నా’ అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.