మహిళలా వేషం వేసుకుని బస్సెక్కాడు.. ఎందుకో తెలిస్తే నవ్వలేక చస్తారు!

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే ఆ రాష్ట్ర ఉచిత ఉచిత పథకాలను అమలు దిశగా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే “శక్తి యోజన పథకం” కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శక్తి యోజన పథకాన్ని ఆసరాగా చేసుకున్న కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ముస్లిం మహిళలా బుర్కా వేసుకుని బస్సెక్కాడు. ఇక కండక్టర్ కు అనుమానం రావడంతో అతని ప్రశ్నించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ధర్వాడ్ జిల్లా కుందగోళ పరిధిలోని సంశీ బస్టాండంలో మఠపతి అనే వ్యక్తి ముస్లిం మహిళలా బుర్కా వేసుకుని బస్టాండ్ లో కూర్చున్నాడు. ఇక అతడు బస్సెక్కి తన గమ్యానికి చేరాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే మఠపతి బస్టాండ్ లో ఓ బస్సు ఎక్కాడు. అతడు బస్సులోకి ఎక్కగానే కండక్టర్ కు ఎందుకో అతని మీద కాస్త అనుమానం కలిగింది. వెంటనే మఠపతిని ప్రశ్నించే సరికి నోట్లో నీళ్లు నమిలాడు. ఇక అందరూ కలిసి అతడిని గట్టిగా అడగ్గా.. మొత్తానికి అసలు నిజాన్ని బయటపెట్టాడు. బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకే ఇలా చేశానని అతను ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అతను వేసుకున్న బుర్కా కూడా విప్పాడు. ఇదంతా కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Show comments