iDreamPost
android-app
ios-app

ICICI బ్యాంకులో సంచలనం! 17 వేల క్రెడిట్ కార్డులు బ్లాక్! కారణం ఏమిటంటే?

ICICI Credit Cards Blocked: ప్రైవేటు బ్యాంకుల్లో ప్రముఖమైన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంకు ఒకటి. దీనికి పెద్ద సంఖ్యలోనే కస్టమర్లు ఉన్నారు. ఎంతో ఫేమస్ అయినా ఈ బ్యాంకులో గురువారం ఓ సంచలనం చోటుచేసుకుంది. ఏకంగా 17వేల క్రెడిట్ కార్డులు బ్లాక్ అయ్యాయి. దీనిపై సదరు బ్యాంక్ కూడ వివరణ ఇచ్చింది.

ICICI Credit Cards Blocked: ప్రైవేటు బ్యాంకుల్లో ప్రముఖమైన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంకు ఒకటి. దీనికి పెద్ద సంఖ్యలోనే కస్టమర్లు ఉన్నారు. ఎంతో ఫేమస్ అయినా ఈ బ్యాంకులో గురువారం ఓ సంచలనం చోటుచేసుకుంది. ఏకంగా 17వేల క్రెడిట్ కార్డులు బ్లాక్ అయ్యాయి. దీనిపై సదరు బ్యాంక్ కూడ వివరణ ఇచ్చింది.

ICICI బ్యాంకులో సంచలనం! 17 వేల క్రెడిట్ కార్డులు బ్లాక్!  కారణం ఏమిటంటే?

ప్రస్తుతం సేవరంగంలో అతి ముఖ్యమైన వాటిల్లో బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి. నిత్యం ఎంతో మంది వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలానే బ్యాంకింగ్ సంబంధించిన వాటితో చాలా మంది వినియోగదారులు సేవలు పొందుతుంటారు. అలానే వివిధ రకాల బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో సేవలు ఇస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొన్ని ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా సాంకేతిక లోపం కారణంగా ఓ ప్రముఖ ప్రైవేటు బ్యాంకుకు సంబంధించిన 17వేల క్రెడిట్ కార్డులు బ్లాక్ అయ్యాయి. తరువాత సదరు బ్యాంక్ అలెర్ట్ అయి వెంటనే సమస్యను క్లియర్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటోఇప్పుడు చూద్దాం..

ప్రైవేటు బ్యాంకుల్లో ప్రముఖమైన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంకు ఒకటి. దీనికి పెద్ద సంఖ్యలోనే కస్టమర్లు ఉన్నారు. అనేక రకాల సౌకర్యాలు, సదుపాయాలతో కస్టమర్లను ఆకర్షించడంలో ఐసీఐసీఐ ఎప్పుడు మందుంటుంది. ఇక ఫిక్స్ డిపాజిట్లు, ఇతర డిపాజిట్లకు సంబంధించిన వివిధ సమాచారాన్ని తరచూ వెల్లడిస్తుంది. గరువారం ఐసీఐసీఐ బ్యాంక్ కి సంబంధించి ఓ సంఘటన చోటుచేసుకుంది. సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్‌ కార్డులు ప్రభావితమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఈ కార్డులు డిజిటల్‌ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు కనెక్ట్ అయినట్లు తెలిపింది. అలానే ఈ ఇష్యూను వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. అలాగే ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగం జరిగినట్లు తమకు సమాచారం అందలేదని ఐసీఐసీఐ పేర్కొంది. ఈ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం..

ఆన్ లైన్ లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న వినియోదారుల అకౌంట్లకు కొత్త క్రెడిట్ కార్డులు తప్పుగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికే ఉన్న కస్టమర్లు..  వేరే వారి కోసం ఉద్దేశించిన కొత్త కార్డ్ కనెక్ట్ అయ్యాయి. అలానే వారు వాటిని చూడగలిగారు. తాము అసలు దరఖాస్తు చేయకున్నా ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వగానే.. కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని కొందరు సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య  సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే బ్యాంకు దీన్ని గురువారం ధ్రువీకరించింది.

ఈ తాజా ఘటనతో క్రెడిట్‌ కార్డు పూర్తి సంఖ్య, సీవీవీ వంటి వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్‌ చేయడం కుదరదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన వివరాల ద్వారా ఎలాంటి మోసం జరిగి ఉండకపోవచ్చునని నిపుణలు అభిప్రాయాపడుతున్నారు. ఈ ఘటనపై ఐసీఐసీ బ్యాంకు స్పందించింది. తప్పుగా కనెక్ట్ అయిన కార్డులన్నింటినీ బ్లాక్‌ చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. కొత్తవారికి మరోసారి కొత్త కార్డులు జారీ చేస్తామని బ్యాంకు హామీ ఇచ్చింది. ఈ ఇష్యూ జరిగిన తరవాత ఇప్పటి వరకు సమాచారం దుర్వినియోగమైన ఘటనలు తమ దృష్టికి రాలేదని తెలిపింది. వినియోదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎదైనా ఆర్థిక నష్టం జరిగేతే పరిహారం చెల్లించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చింది. మరి.. ఐసీఐసీఐ బ్యాంకు విషయంలో జరిగిన ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.