nagidream
Teachers Bed Performance Letter Viral: హవ్వా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ల బెడ్ పెర్ఫార్మెన్స్ ఏంటి? బెడ్ పెర్ఫార్మెన్స్ అంటూ విద్యాశాఖ అధికారులు లెటర్ రాయడం ఏంటి? వారిపై చర్యలు తీసుకోవడం ఏంటి? అసలు స్కూల్లో బెడ్ పెర్ఫార్మెన్స్ ఏంటి? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి?
Teachers Bed Performance Letter Viral: హవ్వా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ల బెడ్ పెర్ఫార్మెన్స్ ఏంటి? బెడ్ పెర్ఫార్మెన్స్ అంటూ విద్యాశాఖ అధికారులు లెటర్ రాయడం ఏంటి? వారిపై చర్యలు తీసుకోవడం ఏంటి? అసలు స్కూల్లో బెడ్ పెర్ఫార్మెన్స్ ఏంటి? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి?
nagidream
పిల్లలు తప్పులు చేస్తే టీచర్లు బుద్ధి చెప్తారు. బెత్తంతో రెండు దెబ్బలు వేయడమో, గిల్లడమో చేస్తుంటారు. మరి టీచర్లు తప్పు చేస్తే? ఆ తప్పులు క్షమించరానివైతే వాళ్ళని చట్టం శిక్షిస్తుంది. ఈ మధ్య గురువు ముసుగులో కొంతమంది ఉపాధ్యాయులు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కూడా అబ్బాయిలను సైతం లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పుతప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా తప్పులు చేసిన వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం మనం చూసాం. అయితే తాజాగా టీచర్ల బెడ్ పెర్ఫార్మెన్స్ కారణంగా వారి జీతాలు కట్ చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వారి పనితీరు సంతృప్తికరంగా లేదని విద్యాశాఖ సీరియస్ అయ్యింది.
విద్యాశాఖ అధికారులు వివిధ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీంతో టీచర్లది బెడ్ పెర్ఫార్మెన్స్ అంటూ వారి జీతాలు కట్ చేశారు. అసలు స్కూల్లో టీచర్ల బెడ్ పెర్ఫార్మెన్స్ ఏంటి? పాఠాలు చెప్పడం మానేసి బెడ్ పై పడుకుంటున్నారనా? లేక బెడ్ పై పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారనా? ఇవేమీ కారణాలు కాదు. కానీ బెడ్ పెర్ఫార్మెన్స్ కారణంగా విద్యాశాఖ అధికారులు జీతాలు కట్ చేస్తున్నామంటూ ఒక లెటర్ ని విడుదల చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ లోని జాముయి జిల్లా పరిధిలో ఉన్న వివిధ పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్యూటీలకు గైర్హాజరు అయ్యారు.
అలానే టీచర్ల పని తీరు కూడా సంతృప్తికరంగా లేదని స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ ఒక లేఖ రాసింది. 13 మంది ఉపాధ్యాయుల బెడ్ పెర్ఫార్మెన్స్ కారణంగా మీ జీతాల్లో కోత విధించడం జరిగిందని విద్యాశాఖ లేఖలో పేర్కొంది. అయితే ఇదే ఇప్పుడు విద్యాశాఖ పరువు తీసేందుకు కారణమైంది. అది బెడ్ పెర్ఫార్మెన్స్ కాదని.. బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసుకోవాలి కదరా బుజ్జి అంటూ సెటైర్లు విసురుతున్నారు. బెడ్ కి, బ్యాడ్ కి తేడా తెలియకపోతే హౌ ఆ హౌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో డీఈఓ కార్యాలయం వారు స్పందిస్తూ.. టైపింగ్ మిస్టేక్ వల్ల బ్యాడ్ బదులుగా బెడ్ అని పడిందని వివరణ ఇచ్చారు.