Traffic Rules: వీడియో: ట్రాఫిక్ రూల్స్ పై పాటలతో అవగాహన కల్పిస్తున్న పదేళ్ల కుర్రాడు! హ్యట్సాఫ్

వీడియో: ట్రాఫిక్ రూల్స్‌పై పాటలతో అవగాహన కల్పిస్తున్న పదేళ్ల కుర్రాడు! హ్యట్సాఫ్

Spreads Awareness About the Traffic Rules: ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అంటున్నారు పోలీసులు. ఓ కుర్రాడు పదేళ్ల వయసులోనే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ..

Spreads Awareness About the Traffic Rules: ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అంటున్నారు పోలీసులు. ఓ కుర్రాడు పదేళ్ల వయసులోనే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ..

దేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.. చలాన్లు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్లు తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకుంటారా? లేలా అన్న అనుమాలు వస్తున్నాయి.డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్య సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, అనుభవం లేకున్నా మైనర్లు వాహనాలు నడపడం వల్ల నిత్యం పదుల సంఖ్యల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. అనాథలుగా మిగులుతున్నారు. ఓ పదేళ్ల కుర్రాడు ట్రాఫిక్ రూల్స్ పై తనదైన స్టైల్లో ప్రదర్శన ఇస్తూ అందరినీ ఆకట్టున్నాడు. ఈ కుర్రాడు ఎవరు? ఎక్కడ? అనే వివరాల్లోకి వెళితే..

పదేళ్ల వయసులో ఎవరైనా చదువు, తోటి స్నేహితలతో ఆటలపై శ్రద్ద చూపుతుంటారు. ఇంట్లో ఉంటే వీడియో గేమ్స్ తో బిజీగా ఉంటారు. కానీ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ కు చెందిన ఓ పదేళ్ల కుర్రాడు అద్భుతం చేశాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. స్థానిక ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ కుర్రాడిని ‘ట్రాఫిక్ ఆఫ్ ఇండియా ’అని పేరు కూడా పెట్టరాు. ఇంతకీ ఈ పదేళ్ల చిన్నోడు చేస్తున్న పనేంటో తెలుసా? ప్రజలకు అంతలా ఎందుకు మెచ్చుకుంటున్నారో తెలుసా? అన్న విషయం తెలుసుకుందాం. మద్య ప్రదేశ్ కి చెందిన ఆదిత్య తివారీకి పదేళ్ల వయసు. చిన్న తనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచుకున్నాడు.

ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో అవగాహన తీసుకు రావడానికి వినూత్నమైన ప్రయోగం మొదలు పెట్టాడు. తన సొంతంగా కంపోజ్ చేసుకున్న పాటలు పాడుతూ ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తి అవగాహన కల్పిస్తున్నాడు. గత మూడేళ్లుగా సమయం చిక్కినప్పుడల్లా ట్రాఫిక్ పోలీసుల సహకారంతో సిగ్నల్స్ వద్ద పాటలు పాడుతూ వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నాడు. ఆదిత్య తివారీ ఇండోర్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సైనిక దుస్తులు ధరించి తాను కంపోజ్ చేసిన పాటలు పాడుతూ వాహనదారులకు పలు సూచనలు ఇస్తున్నాడు. హెల్మెట్ ధరించిన వారికి, సీటు బెల్టు పెట్టుకున్న వారి వద్దకు వెళ్లి చాక్లెట్లు సైతం ఇస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూస్తున్న నెటిజన్లు ఇంత చిన్న వయసులో ఇంత బాధ్యత.. సూపర్ అంటూ ఆదిత్య చేస్తున్న పనిని ఎంతగానో మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆదిత్య లాంటి కుర్రాడిని ఇతర పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.. ఆదిత్యకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Show comments